కోవిడ్ యోధుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు
మానవత్వ ధీర పురస్కారం
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అనంతపురం లోని పోలీస్ కాన్ఫెరెన్స్ హాల్ లో ఉమర్ ఫారూఖ్ ఖాన్ సేవలను ప్రశంసిస్తూ మానవత్వ ధీర పురస్కారo అందించారు వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ గౌతమె సవాంగ్ గారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ తో మాట్లాడారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారితో సేవలు వివరిస్తూ సేవలతో పాటు మత సామరస్యం.
పరమత సహనం.సోదరభావం పెంపొందించటానికి జాతీయ సమైక్యత దేశభక్తి అనే విషయాల పై రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించటానికి సహాయ సహకారాలు అందించాలనిడీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి విజ్ఞప్తి చేశారు చేశారు.కోవిడ్ మహమ్మారి సమయంలో కోవిడ్ బాధితులను పరామర్శించి అవసరమైతే వారిని వైద్యశాల కు ఐసోలేషన్ సెంటర్ లకు తరలించి కోవిడ్ తో మరణించి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాని పక్షంలో కుల మతాలకు అతీతంగా సోదర భావంతో పరమత సహనం తో అంత్యక్రియలు చేయటం కోవిడ్ తో బాధపడుతున్న కుటుంబానికినిత్యావసర వస్తువులు అందజేయడం తదితర సామాజిక సేవలను గుర్తిస్తూ అనంతపురం జిల్లా ఎస్పీగారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ను సన్మానిస్తూ ప్రశంసా పత్రం తో గౌరవించి సన్మానించారు గతం లో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ జాతీయ -2021పురస్కారం అందుకున్నారు
ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దాదాపు 20సంవత్సరాల నుంచి 51సారి రక్తదానం చేసి వందలాది రక్తదాన చైతన్య కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు కోవిడ్ శవాలను కుల మతాలకు అతీతంగా వారి సాంప్రదాయాల ప్రకారం ఉదయ్ లైఫ్ వరల్డ్ సేవాసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తూ శుభ కార్యాలలో మిగిలిన ఆహారపదార్థాలు అన్నార్తులకు అందజేస్తూ మతోన్మాద కులోన్మాద తీవ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు మత సామరస్య పరమత సహనం సోదరభావం వసుధైక కుటుంబం పెంపొందించే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కు గుర్తింపుగా జాతీయ స్థాయిలో ఢిల్లీ లో 2019జ్యోతీరావు పూలే జాతీయ పురస్కారం.ఉత్తమ రక్తదాత పురస్కారం కలెక్టర్ వీరపాండ్యన్ గారి చేతుల మీద ఉగాది సాహిత్య పురస్కారం.అనంత సాహిత్య పురస్కారం.జనవిజ్ఞాన వేదిక ద్వారా రాయలసీమ సేవా రత్నం పురస్కారం .ఫెర్రర్ గారి చేతులమీద సేవా పురస్కారం.2018బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం.2019అంబేద్కర్ మనుముడు రాజరత్న అంబేద్కర్ చేతులమీద అంబేద్కర్ రత్న జాతీయ సేవా పురస్కారం.2021రాష్ట్ర స్థాయి మదర్ థెరిస్సా పురస్కారం.
వేదిక తెలుగు నంది జాతీయ పురస్కారం 2021ఢిల్లీ లో భగవాన్ బుద్ధ ఎక్స్ లెన్సీ జాతీయ పురస్కారం వందకు పైగా పురస్కారాలుఅందుకున్నా రు పీడిత సామాజిక వర్గాల తో ఐక్యఉద్యమాలు.అణగారిన వర్గాలకు బాసటగా.దళిత ఉద్యమాలలో దళిత ముస్లిం గా ముందుకు వెళ్తూ ఇక ముందుకు కూడా సేవలు కొనసాగిస్తూ రాష్ట్రమంతటా మత సామరస్యం .పరమత సహనం.సోదరభావం. పెంపొందించటానికి ఆచరణాత్మక ప్రయత్నం కొనసాగిస్తానని నా సేవలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి ఉద్యమ కారులు రచయితలు మేధావులు సామాజిక సేవకులు వందలాది మంది పాల్గొన్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు అభినందనలు తెలిపారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: