పెంచిన పన్నుల ను వెంటనే ఉపసంహరించుకోవాలి
జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
ఆస్తిపన్ను. చెత్త పన్నుల. నీటి పన్నులను పెంచుతూ జారీ చేసిన జీవో నెంబర్ 197- 198 వెంటనే ఉపసంహరించుకోవాలి జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తున్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి జీవోలు తీసుకురావడమా అని ఆయన ప్రశ్నించారు. కరోనా కట్టడిపట్ల శ్రద్ద చూపకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మరోవైపు అస్తిపన్నుల పెంపుతో ప్రజలపై బాదుడుకు ప్రారంభించడం ధారుణమని ఆయన విమర్శించారు. కరోనా వేళ ఉపాధి లేక ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
పెట్రోల్ ధర లీటరు రు.100 దాటిపోవడం వంటి వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు పట్టణ ప్రజలపై ఆస్తి విలువ ఆధారంగా ఆస్తిపన్ను పెంచడం, చెత్తపన్ను కేటగిరీలుగా పెంచడం, మంచినీటి చార్జీలు, యూజర్ చార్జీలను పెంచేందుకు పావులు కదుపడం శోచనీయమన్నారు. పారిశుధ్య నిర్వాహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటూ చెత్తపై పన్ను వేయడం తగదన్నారు. ఇప్పటికే పలు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో పన్నులను పెంచుతూ ఆ మేరకు తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ లాక్ డౌన్, కర్ఫ్యూ వల్ల వ్యాపారాలు, ఉపాధి లేక ప్రజలు అల్లాడుతుంటే మరోప్రక్క ఉన్న పన్నులను మరింత పెంచడం విచారకరమని ఆయన విమర్శించారు. మున్సిపాలిటీలలో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల కుటుంబాలపై పెరిగిన పన్నుల భారం పడుతుందని, కరోనా తీవ్రతతో ఆర్థికంగా అల్లాడుతున్న ప్రజలకు అస్తి, చెత్తపన్నుల పెంపు గుదిబండేనని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఆస్తి పన్ను పెంపుదల జీవోలను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్తిపన్ను, మంచినీటి ఛార్జీల పెంపు జీవోలు 197, 198 లను తక్షణమే ఉపసంహరించాలన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: