ఒక గొంగళి పురుగును వదిలి మరోటిని కౌగలించు కోవడమే
ఈటెలపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ విమర్శ
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం ఒక గొంగళి పురుగును వదిలి ఇంకొక గొంగళి పురుగును కౌగలించు కోవడమేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ఎద్దేవాచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బర్తరప్ అయ్యే వరకు కె.సి.ఆర్ ను పొగిడిన ఈటెల ఈ రోజు బాజపా గూటికి చేరటముతో రేపటి నుండి ఆత్మ గౌరవాన్ని గూటిలో పెట్టి బాజపాను, మోడిని పొగడుతూ తిరుగుతారు. ప్రజలకు ఒరిగేది మాత్రము ఏమి లేదు. అసలుకు ఈటెలకు ఆత్మ ఉంటే గదా ఆత్మ గౌరవం ఉండటానికి. హైదరాబాద్, హుజూరాబాద్ లో మాట్లాడిన ప్రతి సారి ఆత్మ గౌరవాన్ని గూర్చి మాట్లాడిన ఈటెల ఈ రోజు డిల్లీ లో భాజపా లో చేరుతూ మాట్లాడినప్పుడు ఆత్మ గౌరవం ఊసే లేదు. పైపెచ్చు తెలంగాణా, దక్షణ భారత దేశములో బీజేపీ నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొనడం ఆయన ఆత్మ గౌరవం నినాదం లోని డొల్ల తనాన్ని బట్టబయలు చేస్తున్నది. బీజేపీ, టి.అర్.ఎస్ ల పై ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్మై చీదరించుకుంటున్న సమయములో ఈటెల భాజపా లో చేరడటము ఒక గొంగళి పురుగును వదిలి ఇంకొక గొంగళి పురుగును కౌగలించు కోవడమే అవుతుంది. ఇది ఈఅటెల నిరాశా నిస్పృహ నిస్సహాయతలను ప్రతిబింబిస్తుంది. అని ఆయన అభివర్ణించారు.
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: