కరోనాతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై,,

జమాతే ఇస్లామి హింద్ ఆందోళన


జమాతే ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ముహమ్మద్ సలీం ఇంజినీర్

(జానోజాగో వెబ్ న్యూస్-న్యూఢిల్లీ బ్యూరో)

కరోనాతో దేశంలో నెలకొన్న రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులపై జమాతే ఇస్లామి హింద్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో బీదరికం, నిరుద్యోగం,పర మత సహన లోభత్వం, అవినీతి, అన్యాయం తారాస్థాయికి చేరాయని ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ పరిస్థితి మరీ ఆదోళనకరంగా ఉందని జమాతే ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ముహమ్మద్ సలీం ఇంజినీర్ ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడ రాజకీయ విమర్శకులను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలుగెత్తే గొంతులను అణచివేసేందుకు అన్ని మార్గాలను ప్రయోగింస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారంనాడు నిర్వహించిన ఆన్ లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ..

జమాతె ఇస్లామి జాతీయ సెక్రటరి మలిక్ మోతసిం ఖాన్ 

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సీబీఐ, న్యాయస్థానం, పోలీసు వ్యవస్థ  వంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి పతనావస్థకు చేరిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ తో దేశం ఆర్థికంగా దెబ్బతిన్నదన్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సంతో పూర్తిగా దేశం కుదేలైపోయిందన్నారు. దేశ సామాజిక పరిస్థితి చూస్తే బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళల పై దౌర్జనాలు ఇంకా పెరిగాయని అన్నారు. లక్ష్య ద్వీప్ లో ప్రజలు ప్రాధమిక హక్కులు హరించబడుతున్నాయని అన్నారు. ఇంకా సలీం ఇంజినీర్ మాట్లాడుతూ, పాలస్తీనా లో పౌరులపై  ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు, బలవంతంగా వారి ఇళ్ల నుంచి వెల్లగొట్టడం, రమజాన్ లో ఆరాధనల్లో నిమగ్నమైన వారి పై విరుచుకు పడటం వంటి విపత్కర పరిస్థితులు పాలస్తీనా వైపు ప్రపంచ ప్రజలను మరోసారి మరిలేలా చేసిందని,ఇశ్రాయేలు అమానుషంగా ప్రవర్తిస్తుందన్నారు.

జమాఅతె ఇస్లామి హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కార్యదర్శి ముహమ్మద్ అక్బర్ బాషా
 

కోవిడ్ తో దేశవ్యాప్తంగా వ్యాపించిన విధ్వంసం ను గురించి జమాత్ ఇస్లాం హింద్ జాతీయ సెక్రటరీ మలిక్ మూతసిం ఖాన్  వివరించారు. కోవిడ్ తో చనిపోయిన వారి వితంతువులకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని, పిల్లలకు స్కాలర్షిప్ లు అందజేయాలని, వారికి ఉచిత  విద్య అందించాలని, కోవిడ్ బాధిత కుటుంబంలో ఉద్యోగ అర్హత గల వారికి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇవ్వాలని జమాతే ఇస్లామి హింద్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని రాష్ట్ర మీడియా  కార్యదర్శి ముహమ్మద్ అక్బర్ బాషా తెలిపారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: