మేకలవారి పల్లి టోల్ ప్లాజా సమీపంలో

ఢికొట్టిన ద్విచక్ర వాహనం..ఒకరి మృతి

మరోకరి పరిస్థితి విషమం


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

మేకలవారి పల్లి టోల్ ప్లాజా సమీపంలో కాలినడక తో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని మేకలవారి పల్లె టోల్ గేట్ సమీపంలో నేషనల్ హైవే రహదారిపై కాలినడకతో జంగంరెడ్డిపల్లె నుండి మేకల వారి పల్లి గ్రామానికి కాలినడకన వస్తుండగా మార్కాపురం నుండి కలుజువ్వలపాడు గ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తూ వీరిద్దరినీ ఢీకొట్టడంతో వీరిలో ఏలమేల. జాన్ బెన్ని 55సం అక్కడికక్కడే మృతి చెందగా

వీరి తమ్ముడు ఎలిమేల. కాశయ్య  35సం కు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రుని 108 వాహనంలో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి తాడివారిపల్లె పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు  జంగం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ కి చెందినవాడు కావడంతో ఆ కాలనీవాసులు మొత్తం రహదారిపై గుంపులుగా చేరి మృతుని కుటుంబానికి ఆదుకొని న్యాయం చేయాలంటూ తెలియజేశారు،  బైక్ పై వెళ్తున్న వ్యక్తులు కలుజువ్వలపాడు పంచాయతీ గండ్లోపల్లి  గ్రామానికి చెందినవారు.  నాలి. శ్రీనివాసులు ఆయన తండ్రి ఇద్దరు బైక్ పై వెళుతున్న వ్యక్తులు అని గ్రామస్తులు తెలియజేశారు.



 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: