విందాం రారండోయ్...

అబ్దుల్ రషీద్ కలం నుంచి జాలువారిన

తీయ్యటి తెలంగాణ ప్రత్యేక కవితా 
నా తెలంగాణ శత కోటి రతనాల వీణ

అప్పుడది 

రాళ్ల తెలంగాణ

ఇప్పుడిది 

రతనాల తెలంగాణ 

అప్పుడది 

ఎండి పోయిన 

తెలంగాణ 

ఇప్పుడిది 

గలగల పారుతున్న 

సెలయేళ్ల 

తెలంగాణ 

అప్పుడది 

బీడు వారిన 

తెలంగాణ 


 

ఇప్పుడిది

పచ్చపచ్చగా నవనవలాడుతున్న 

తెలంగాణ 

అప్పుడది 

చిమ్మ చీకటితో 

నిండిన తెలంగాణ 

ఇప్పుడిది 

ఎడతెగని 

విద్యుత్ కాంతులు

విరజిమ్ముతున్న

తెలంగాణ 

అప్పుడది 

ఒంటరి స్త్రీలను 

ఆగమాగం 

చేసిన తెలంగాణ

ఇప్పుడిది వారికి 

అండగా నిలుస్తున్న

తెలంగాణ 

అప్పుడది 

వితంతువులు, వయోవృద్ధులు,

దివ్యాంగులు

అష్టకష్టాలు పడిన 

తెలంగాణ 

ఇప్పుడు వారిలో

సంతోషాలు

పంచుతున్న

తెలంగా ణ  

అప్పుడది స్కీములే 

స్కాములయిన 

తెలంగాణ  

ఇప్పుడు 

ముబారక్ లక్ష్మీ 

స్కీముల తెలంగాణ 

అప్పుడది 

బాలింతలు బాలలను పట్టించుకోని

తెలంగాణ 

ఇప్పుడిది వారికి

ఆయువుపట్టయిన 

తెలంగాణ 

అప్పుడది మైనారిటీలను అథమ స్థానంలో నిలిపిన తెలంగాణ 

ఇప్పుడిది వారిని 

ఉన్నత శిఖరాలకు 

చేరుస్తున్న తెలంగాణ 

అప్పుడది 

సాహిత్య సంపదను ఎదగనీయని తెలంగాణ  ఇప్పుడిది 

దానికి పెద్ద పీట వేసి ఆదరిస్తున్న 

తెలంగాణ 

అప్పుడది 

జల కాష్ట రహితమైన తెలంగాణ

ఇప్పుడిది భగీరథుడి యత్నంతో 

బంగారం 

పండిస్తున్న 

 తెలంగాణ

అప్పుడది 

సుషుప్తావస్తలో ఉన్న 

తెలంగాణ

ఇప్పుడిది 

జాగృతి కలిగిస్తున్న

తెలంగాణ 

అప్పుడైనా ఇప్పుడైనా మరెప్పుడైనా 

ప్రజల క్షేమం కోరే ప్రభుత్వాన్ని దేవుడు సల్లంగా సూస్తాడు సమృద్ధి కలుగజేస్తాడు


జూన్ 2

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

 

మొహమ్మద్ అబ్దుల్ రషీద్ హైదరాబాద్

రచయిత,,,అనువాదకులు,,, కవి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: