ఈ తప్పును సరిదిద్దేదెవ్వరూ...

బైక్ లతో రోడ్లపైకి వస్తున్న మైనర్లు

పోలీసులకు మైనర్ల రూపంలో కొత్త తలనొప్పి

చలాన్లు వేయలేక వారిని నిరోధించలేక

గడివేములలో వింత పరిస్థితి-మైనర్లను అదుపులో ఉంచే బాధ్యత ఎవరిది...?


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కరోనా వేళ రోడ్డుపైకి వాహనాలతో వచ్చే అకతాయిలు పోలీసులకు సవాల్ గా మారుతుంటే తాజాగా గడివేముల పరిధిలో ద్విచక్ర వాహనాలతో మైనర్లు రోడ్డుపైకి రావడం మరో తప్పనొప్పిగా మారింది. కరోనా వేళ లాక్ డౌన్ సమయంలోనూ వీరు రోడ్డుపైకి రావడంతో పోలీసులకు ఏం చేయాలో తోచడంలేదు. వారిపై చలాన్లు వేసి పరిస్థితి లేదు. తాము ఫలాన వారి పిల్లలమని వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి చెప్పడం పోలీసులకు కొత్త తలనొప్పిగా మారింది. మరి ఈ పరిస్థితుల్లో మైనర్లు ద్విచక్ర వాహనాలతో రోడ్డుపైకి రాకుండా నివారించే బాధ్యత ఎవరిది. ఇది కాస్త తల్లిదండ్రులు ఆలోచన చేయాలి అని పోలీసులు పేర్కొంటున్నారు. తమ పిల్లలపై ప్రేమానురాగాలు ప్రతి తల్లిదండ్రులకు ఉంటాయి. తమ పిల్లాడు కోరితే ఏదైనా కొన్నిచ్చే నైజం సహజంగా తల్లిదండ్రులది. కానీ ఆ ప్రేమ పరిధి దాటితే ఎవరికి నష్టం. డ్రైవింగ్ లైసెన్స్, బండి ఆర్సీ లేకుండా రోడ్డుపైకి ద్విచక్ర వాహానాలతో రావడం చట్ట రిత్యా నేరం. మరి మైనర్లు ఈ నిబంధనలను ఉల్లంఘించడం పై ఎవరు బాధ్యత తీసుకోవాలి.

ఈ దిశగా ప్రతి తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. డ్రైవింగ్ అనుభవంలేకుండా రోడ్డుపైకి వస్తే తమ పిల్లలకు ఏమైన అయితే అల్లారుముద్దుగా పెంచుకొనే ప్రతి ఒక్క తల్లితండ్రి ఆలోచన చేయాలి. అందులోనూ కరోనా వేళ ఇలా బయటకు రావడం ఎంతవరకు శ్రేయస్కరమే ఆలోచన చేయాలి. భౌతిక దూరం పాటించకుండా ఇబ్బడిముబ్బడిగా తిరగడంవల్లే కరోనా వ్యాపిస్తోంది. ఈ కారణం చేతనే ప్రభుత్వాలు లాక్ డౌన్లు విధించాయి. మరి తల్లిదండ్రులను ఒప్పించి వారి వాహనాలను వారి పిల్లలైన మైనర్లు తీసుకొని రోడ్డుపైకి రావడం, కరోనా వ్యాప్తికి ఊతమివ్వడమే. ఈ ఉాద్దంతాలకు ఎవరు బాధ్యత వహించాలి. మైనర్లు కాబట్టి పోలీసులు కూడా వారి పట్ల కఠినంగా వ్యవహరించలేక కేవలం వారిని మదలించి వదిలేస్తున్నారు. వారిపై ఎలాంటి జరిమానాలు విధించడంలేదు. కానీ వీరి వల్ల కరోనా విస్తరణ సాగితే వారిని నియంత్రించకపోవడం పోలీసుల తపు అవుతుందా లేక వారి తల్లిదండ్రులదా....? బయటకు వస్తే కరోనా కటేస్తుందని ఇంట్లో ఉండి కరోనా నుంచి దూరంగా ఉండండి అని వైద్య నిపుణులతోపాటు ప్రభుత్వాలు మొత్తుకొంటున్నాయి. కానీ యథేచ్చగా రోడ్డుపైకి వస్తున్న వాహనాలవల్ల పెరిగే కరోనా వ్యాప్తికి బాధ్యులెవ్వరో ఓ సారి ఆలోచించుకోవాలి.


 


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: