గజరాణి " రాణి మృతి విచారకరం

జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

గజరాణి " రాణి మృతి విచారకరమని, ఆ ఏనుగు సుమారు ఐదు దశాబ్దముల పాటు అందించిన సేవలు మరువలేనివి అని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం ప్యాట్రన్ జి. నిరంజన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశిష్ట సేవలనందించిన గజరాణి " రాణి " నిన్నటి రోజున నెహ్రూ జులాజికల్ పార్క్ లో తన 83 వ యేట  చనిపోవడము దిగ్భ్రాంతికి గురి చేసింది. సుమారు మూడున్నర దశాబ్దాల కాలము శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరము మరియు శ్రీ ఉజ్జయిని మహంకాళి మాతా బోనాల ఊరేగింపులో పాల్గొన్నది. అంబారీ పై అమ్మవారి ఘటముతో పాల్గొనే గజరాణి ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ఆ దృశ్యాన్ని భక్తితో చూస్తూ అమ్మవారిని దర్శించుకుని ఆనందించడానికి దూర దూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసేవారు. 1963 లో నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ నుండి నెహ్రూ జులాజికల్ పార్క్ కు తరలించినప్పటి నుండి, 1999 లో నిజాం కళాశాల వద్ద జరిగిన టి.డి.పి పార్టీ మహానాడులో బాణాసంచాల చప్పుడుకు బెదిరిపోయే వరకు ప్రతి సంవత్సరము బోనాల ఊరేగింపులో పాల్గొనేది. బాణా సంచాల చప్పుడుకు బెదిరిపోయిన గజరాణి నిజాం కళాశాల నుండి బేగంబజార్ వద్ద కల చుడీ బజార్ వరకు పరిగెడుతూ వచ్చి శాంతిచే వరకు దానిపై పాత నగర టి.డి.పి నాయకుడు పుస్తె బాబూరావు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కూర్చుండటము జరిగింది. ఆ తర్వాత గజరాణి " రాణి " ఆ షాక్ నుండి కోలుకో లేదని బోనాల ఊరేగింపుకు ఇవ్వలేమని నెహ్రూ జులాజికల్ పార్క్ అధికారులు తిరస్కరిస్తే, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరము విఙప్తి మేరకు నిజాం ట్రస్ట్ చైర్మన్ ప్రిన్స్ ముఫ్ఫక్కమ్ జా జోక్యంతో నిజాం ట్రస్ట్ కు చెందిన హాష్మి పేరుగల ఏనుగు బోనాల ఊరేగింపులో పాల్గొన్నది. భక్తులందరి తరపున, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరము తరపున గజరాణి " రాణి " కి శ్రద్దాంజలి. కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాం. అని జి.నిరంజన్ పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: