వ్యాక్సిన్ విషయంలో ప్రధాని నిర్ణయం భేష్

సీఎం జగన్ ప్రతిపాదన కూడా ముఖ్యమే..

థర్డ్ వేవ్ లోపే 80 శాతం హెర్డ్ ఇమ్మ్యూనిటీ రావాలి

డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కేంద్రమే వ్యాక్సిన్ కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందించడం ఆహ్వానించే పరిణామం అని ఎస్సార్సీ లాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ నిర్ణయం వలన రాష్ట్రాలకు భారం తీరనుందని ఆయన చెప్పారు. అలాగే జూన్ 21 నుంచి సాధ్యమైనంత త్వరగా 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే నిర్ణయం కూడా మంచిదే.. కానీ ఈ నిర్ణయం పరిపూర్ణంగా అమలు కావాలి అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు వ్యాక్సిన్ ఫార్ములాను వీలైనంత త్వరగా అన్ని ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని డాక్టర్ ఏలూరి అభిప్రాయపడ్డారు. దీనివలన వ్యాక్సిన్ ఉత్పత్తి వేగంగా జరిగి.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందకుంటుందని అన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా జరిగితే అంతే వేగంగా ప్రజలకు హెర్డ్ ఇమ్మ్యూనిటీ పెరుగుతుందని చెప్పారు.. దేశంలో 80 శాతం హెర్డ్ ఇమ్మ్యూనిటీ గనక వచ్చినట్లయితే మహమ్మారి బారి నుండి దాదాపు తప్పించుకున్నవాళ్ళం అవుతామని డాక్టర్ ఏలూరి స్పష్టం చేశారు. అలాగే మూడో వేవ్ వచ్చే లోపే జాగ్రత్త చర్యలు అవసరమని.. థర్డ్ వేవ్ వస్తే... వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందన్నారు.. అదే హెర్డ్ ఇమ్యూనిటీ 80 శాతం వస్తే... వైరస్ బలహీనపడుతుందని ఏలూరి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: