అన్నా క్యాటీన్లు ఎక్కడా 

పేదల కోసం వెంటనే వటిని తెరవాలి

జర్నలిస్టులను వారియార్స్ గా గుర్తించాలి..

ఎంపీడీవోకు గడివేముల టీడీపీ నేతల వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

ప్రజల ఆకలి తీర్చుతున్న అన్నా క్యాంటీన్లను వెంటనే తెర్చి పేదలను ఆదుకోవాలని, జర్నలిస్టులను కరోనా వారియార్స్ గా గుర్తించాలని, కరోనా కారణంగా మరణించిన వారి దహన సంస్కారాల కోసం రూ.15వేలు పరిహారంగా చెల్లించాలని, కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలే గనుకు వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని గడివేముల టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డికి గడివేముల టిడిపి నాయకులు దేశం సత్యం రెడ్డి, రమణారెడ్డి, శ్రీకాంత్, నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగ శేషులు తదితరులు ఓ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బాధితులు ఆక్సిజన్ అందక జరిగిన మరణాలన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆయన పేర్కొన్నారు.

 

అందుకే ఆయా కుటుంభాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలన్నారు. కరోనా కారణంగా మారణించిన వారి కుటుంభాలకు 15 లక్షల పరిహారం అందించాలన్నారు. మరణించిన వారి దహన సంస్కరాల కోసం వెంటనే రూ.15వేలు సహాయం అందించాలన్నారు. జర్నలిస్టులను కరనా వారియార్స్ గా గుర్తించి మరణించిన జర్నలిస్టు కుటుంభాలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. అంతేకాకుండా రూ.50 లక్షల భీమా కల్పించాలన్నారు. టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్లు పేదల ఆకలిని తీర్చేవన్నారు. కరోనా వంటి కష్టకాంలో వెంటనే అన్నా క్యాంటీన్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: