కోవిడ్ తో మరణించిన వ్యక్తి అంత్యక్రియలు

వితరణ చాటుకొన్న ముస్లిం నగారా


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ సామాజిక సేవా సంస్థహిందూపురం పట్టణము లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ తో మరణించిన పెనుగొండ వాసి హాఫీజుల్లా 70అంత్యక్రియలు ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగాయి గత కొద్ది రోజులుగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని పెనుగొండ వాసి ఉన్నారు ఉదయం 6గంటల సమయంలో మరణించారు బంధువులు దూరప్రాంతాల్లో

 
ఉండి లాక్ డౌన్ కారణంగా రాలేక భార్య ఇబ్బంది పడుతుంటే స్టాంప్ రైటర్ ఆసీఫ్ ఉమర్ ఫారూఖ్ ఖాన్ దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్. టిప్పు బ్రిగేడ్ అధ్యక్షులు అతీఖుర్రహమాన్. ఇనాయతుల్లా. గౌస్.తదితరులు ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా కోవిడ్ తో మరణించిన బాధితులకు బాసటగా అంత్యక్రియలు నిర్వహించి సహకరిస్తామని విజ్ఞప్తి చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: