ఖాళీ స్థలాలను గుర్తించండి
ఎమ్మెల్యే కుంందూరు నాగార్జున రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని శ్రీ శక్తి భవన్ లో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, విఆర్వో లకు మండల, సచివాలయ సర్వేయర్లు కు సోలార్ ప్రాజెక్ట్, చిన్న చిన్న పరిశ్రమల కొరకు సమావేశం నిర్వహించడం జరిగింది. తర్లుపాడు మండల తహసిల్దార్ పి శైలేంద్ర కుమార్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే కుందూరు.నాగార్జున రెడ్డి మాట్లాడుతూ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అసైన్మెంట్ కానీ ఏ డబ్ల్యూ ల్యాండ్ గాని పరిశీలించి సచివాలయ సర్వేయర్, వీఆర్వోలు, సర్పంచ్ లు అందరూ
కలిసికట్టుగా గ్రామ పంచాయతీల్లో ఎక్కడ ఖాళీ ల్యాండ్ వుందని పరిశీలించి ఎమ్మార్వో నీ తెలియజేయాలని కోరుచున్నాను. ఇప్పటికే మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీలో టోల్ గేట్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉందని మా ఎమ్మార్వో తెలియజేయడం జరిగింది. నేషనల్ హైవే పక్కన గాని, రాష్ట్ర హైవే పక్కన గాని ల్యాండ్ ఉన్నట్లయితే పరిశీలించి మండల డీటెయిల్స్ పూర్తిగా మన చేతిలో ఉంటే కలెక్టర్ మార్కాపురం డివిజన్ ఆఫీస్ కి వచ్చినప్పుడు మనం వివరాలతో చూపించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎస్ నరసింహులు,, వి ఆర్ వో లు, 16 పంచాయితీల సర్పంచులు, సచివాలయ సర్వేయర్లు,వీఆర్ఏలు పాల్గొనడం జరిగినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: