ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటుపై డాక్టర్ ఏలూరి హర్షం

మంత్రులు బాలినేని, సురేష్ ల కృషి ఫలించిందని వ్యాఖ్య

కల సాకారమైందని ఆనందం

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఒంగోలు నగర శివారులో రూ.339 కోట్లతో ఆంధ్రకేసరి యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం వెల్లడైన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆంధ్రకేసరి యూనివర్శిటీని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. మొట్టమొదటిసారి జిల్లాలో వర్సిటీని ఏర్పాటు చేస్తుండటం ఎంతో గర్వకారణం అని అన్నారు.. ఇందుకోసం తీవ్రంగా శ్రమించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, సహకరించిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.. అదే విధంగా జిల్లాను అభివృద్ధి పధంలో పయనింపజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సదా రుణపడి ఉంటాం అని అన్నారు.
జిల్లాలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నది తమ కల అని.. అది నేటితో సాకారం అయిందని ఏలూరి ఆనందంతో చెప్పారు.  యూనివర్సిటీ కోసం విద్యార్థి దశలో తాము ఓ చిన్నపాటి ఉద్యమాన్ని నడిపామన్న ఏలూరి.. 2008 ఎన్నికల ప్రచారంలో మహానేత వైఎస్ఆర్ గారిని కలిసి ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చెయ్యాలని తాము కోరగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.. అయితే దురదృష్టశాత్తు ఆయన కాలం చేయడంతో ఆ తరువాత వచ్చిన పాలకులు ఈ అంశాన్ని మరుగున పడేశారని అన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఆశలు చిగురించాయని.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యూనివర్సిటీ సాధనకోసం ఎంతో కృషి చేశారని.. నేడు బాలినేని కృషి ఫలించి త్వరలో యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుందని స్పష్టం చేశారు..ఇక జిల్లాకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం తోపాటు దొనకొండలో పారిశ్రమలు స్థాపిస్తు.. జిల్లాను అభివృద్ధి పయనంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: