రేషన్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులు స్వీకరించాలి

కేసీఆర్ కు కాంగ్రెస్ నేత జి.నిరంజన్ విన్నపం

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రేషన్ కార్డుల కోసం పాత దరఖాస్తులతోపాటు కొత్తగా కూడా దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు మొయిల్ ద్వారా ఓ లేఖ పంపారు. ఆ లేఖలో ఇలా రాశారు. చాలా కాలం కిందట రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 4,46,169 దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మంజూరు చేయాలని నిన్న రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ, గతములో అప్లయ్ చేసుకోని వేలాది కుటుంబాలకు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నాం. రేషన్ కార్డులు లేనందున వారు ఓపెన్ మార్కెట్లో అధిక ధరలకు నిత్యావసర వస్తువులు కొంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. గతములో రేషనింగ్ అధికారులు ఇంట్లో ఉన్న సభ్యుల పేర్లను కార్డుల నుండి విచక్షణారహితముగా తొలగించారు. విచారణ జరిపి తొలగించిన పేర్లను చేర్చాలి. దారిద్య్రరేఖ దిగువన ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి రేషన్ అందించాల్సిన భాధ్యత ఉన్నా, భవిష్యత్తులో అన్నివర్గాల వారికి పేద, ధనిక భేదము లేకుండా ఆదుకునే అవసరాలు, పరిస్థితులు, ఇటువంటి ఉపద్రవాల వలన ఏర్పడే ప్రమాదముంది. ప్రభుత్వము పౌరులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి భవిష్యత్ సవాళ్లకు సంసిద్దులము కావాల్సిన అవసరముంది. అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: