సీఎం నిర్లక్ష్యంతో వేలాది ప్రాణాలు బలి

కరోనా వేళ టీడీపీ బాధ్యతాయూతమైన పాత్ర

మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

కరోనా వంటి విపత్కర పరిస్థితులలో బాధ్యతగా వ్యవహరించి ప్రజల్లో భరోసా నింపాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇప్పటికే కరోనా బాధితులకు తన వంతు సహాయం అందించిన తెలుగుదేశం పార్టీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత పరుస్తోంది. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం కోసం 81 44 22 6 6 6 1 నంబర్తో మిస్సిడ్ కాల్ క్యాంపెయిన్ చేపట్టింది అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ కరోనా మొదటి దశ వైఫల్యాల నుంచి వైసీపీ ప్రభుత్వం పాఠాలు నేర్చుకోక పోవడంతో సెకండ్ వేవ్ లో పరిస్థితి చేయి దాటి పోయిందని తెలియజేశారు. అత్యంత బాధ్యతగా వ్యవహరించవలసిన ప్రభుత్వం కరోనా మరణాలను దాచి వేయడం అత్యంత దారుణమని తెలిపారు. కరోనా బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 1 1 8 8 2 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం అధికారిక లెక్కలు చెబుతున్నారని కానీ ఆ సంఖ్య 80 వేలకు ఉందని, కాదనలేని వాస్తవం అని తెలియజేశారు.


 

తక్షణం ప్రభుత్వం స్పందించి కరోనాతో మరణించిన కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మార్కాపురం మున్సిపల్ కౌన్సిలర్ నాలి కొండయ్య, పిన్ని క ఆదిలక్ష్మి మల్లికార్జున, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సయ్యద్ గఫార్, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ సభ్యులు డాక్టర్ మౌలాలి, తెలుగుదేశం నాయకులు కొప్పుల శ్రీనివాసులు, మైనారిటి నాయకులు పఠాన్ గులాబ్, పటాన్ ఇబ్రహీం, చలువాది వెంకటేశ్వర్లు, మార్కాపురం మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జవ్వాజి రామానుజుల రెడ్డి పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: