నిషేధిత గుట్కా అమ్మితే కఠిన చర్యలు

గడివేముల ఎస్.ఐ. ఎం.శ్రీధర్ హెచ్చరిక

పలు దుకాణాల అకస్మిక తనిఖీ


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నిషేధిత గుట్కా ఎవరైనా అమ్మితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని గడివేముల ఎస్.ఐ. ఎం. శ్రీధర్ హెచ్చరించారు. నిషేధిత గుట్కా అమ్మడం చట్టరిత్యా నేరమన్నారు. ఎస్.ఐ. ఎం. శ్రీధర్ ఆధ్వర్యంలో పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. కొన్ని దుకాణాలలో నిషేధించిన గుట్కా. తంబాకు. రాజా కైనీ వంటివి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ఎస్.ఐ. ఈ తనిఖీలు నిర్వహించారు.

అనంతరం దుకాణదారులతో ఆయన మాట్లాడారు. నిషేధించిన వస్తువులు ఎవరికీ అమడానికీ వీలు లేదన్నారు. అలా ఎవరైనా అమ్మిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.  ఇలాంటి నిషేధిత గుట్కా అమ్మి లేని సమస్యలు తెచ్చుకోవద్దని ఆయన దుకాణదారులకు సూచించారు.


  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: