అవకతవకలకు పాల్పడిన అధికార్ల సస్పెన్షన్
సమాచారం మేరకు చర్యలు చేపట్టిన పీడీ కే.శీనయ్య
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
తర్లుపాడు మండల కేంద్రం నందు ఉపాధి హామీ పనుల అవకతవకలపై వచ్చిన సమాచారం మేరకు స్పందించిన పీ డి కే.శీనయ్య అధికారులను సస్పెండ్ చేశారు. తర్లుపాడు గ్రామపంచాయతీ లో మస్టర్ లను ఏ.పీ. డి. పరిశీలించగా ఒకరివే సంతకాలు మరియు వేలిముద్రలు వేసినట్లు నిర్ధారించడం జరిగింది. కావున ఏ. పీ. ఓ. వై. మహాలక్ష్మి,, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ బట్టి.రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేసినట్లు ఏ.పి. డి. గారు తెలిపారు. మండలంలో వచ్చే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోకపోవడం లేదు. టెక్నికల్ అసిస్టెంట్ బట్టి రమేష్ కొలతల మీద సరైన అవగాహన కల్పించకపోవడం వలన పనులు చేసినప్పుడు మార్కింగ్ ఇవ్వకపోవడం, మరియు పని ముగిసిన తర్వాత గ్రూపుల వారీగా కొలతలు వెయ్యడం లేదు.ప్రతిరోజు 800 మంది కూలీలు పని చేయుచున్నారు. పనుల వద్ద పర్యవేక్షణ లేకపోవడం వలన ఫీల్డ్ అసిస్టెంట్ వైఫల్యం చెందడం జరిగినది. కావున నలుగురిని సస్పెండ్ చేయడమైనది. అని ప్రకటించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: