బ్యాక్ బోన్ వారియార్స్ కు పదవులు ఇవ్వండి
షేక్ అబ్దుల్ రజాక్ అందుకు అర్హులు
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కు జానోజాగో సంఘం వినతి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)
గత 2019 ఎన్నికల్లో తెరవెనకవుండి వైసీపీ విజయానికి కారకులైన ఉద్యోగ, ప్రజా సంఘాలలోని నేతలకు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం డిమాండ్ చేసింది. పార్టీలో ఉండిపనిచేసే వారికంటే తెరవెనక వుండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సంఘం నేతల పాత్ర కీలకమని పేర్కొంది. ఇలాంటి నేతలను కూడా గుర్తించి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలన్నారు. గత ఎన్నికల్లో తెరవెనక నిలిచి వైసీపీ విజయానికి అనేక మంది మైనార్టీ నేతలు కీలక పాత్ర పోషించారని, అలాంటి నేతల్లో ఆల్ మైనార్టీస్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు అల్ హజ్ షేక్ అబ్దుల్ రజాక్ (ఎస్ఎస్ ఇ) ఒకరని జానోజాగో సంఘం పేర్కొంది.
వైసీపీకి మద్దతుగా మైనార్టీలను, ఈ వర్గ ఉద్యోగులను కూడగట్టడంలో తెరవెనక షేక్ అబ్దుల్ రజాక్ పాత్ర విస్మరించలేనిది అని తెలిపింది. సేవ చేసే వారికే మైనార్టీ నామినేటెడ్ పదవులు అందించాలని కోరింది. అందుకు అర్హులైన వ్యక్తి షేక్ అబ్దుల్ రజాక్ అని జానోజాగో సంఘం పేర్కొంది. ఇలాంటి నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తే పార్టీ విజయానికి తెరవెనకవుండి పనిచేసిన వారికి వైసీపీ ప్రభుత్వం గుర్తించినట్లు అవుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా మైనార్టీ ఉద్యోగుల సంఘం నేతగా ఆయన సేవలు అందించారని, ఇలాంటి నేతలను కూడా వైసీపీ ప్రభుత్వం గుర్తించి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరింది. నిస్వార్థంగా పనిచేసే ఇలాంటి నేతలను ఎంపికచేయడం ద్వారా నామినేటెడ్ పదవుల ఉద్దేశం నెరవేరుతుందని పేర్కొంది. సేవ చేసే వారికే మైనార్టీ నామినేటెడ్ పదవులు అందించాలని కోరింది. అందుకు అర్హులైన వ్యక్తి షేక్ అబ్దుల్ రజాక్ అని జానోజాగో సంఘం పేర్కొంది. ఇలాంటి నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తే పార్టీ విజయానికి తెరవెనకవుండి పనిచేసిన వారికి వైసీపీ ప్రభుత్వం గుర్తించినట్లు అవుతుందన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: