తెలంగాణా ప్రభుత్వానికి బాసటగా...

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా అందిస్తున్న ప్రిన్స్‌ పైప్స్‌


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కోవిడ్‌–19 మహమ్మారితో పోరాడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రయత్నాలకు మద్దతునందించడంలో భాగంగా తమ అంతర్జాతీయ భాగస్వాముల నుంచి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను విమానమార్గంలో దిగుమతి చేసుకుని  విరాళంగా అందించనున్నట్లు  ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ లిమిటెడ్‌ (పీపీఎఫ్‌) తెలిపింది.  ఈ నెలలోనే ఈ కాన్సన్‌ట్రేటర్లను రాష్ట్ర ఉన్నతాధికారులకు అందించనున్నారు. దక్షిణ భారతదేశపు మార్కెట్‌లలో విస్తరించేందుకు తమ 7వ తయారీ కేంద్రాన్ని తెలంగాణాలో ఇటీవల ప్రారంభించారు. ఈ నెలారంభంలో ఈ కంపెనీ బీహార్‌ మరియు రాజస్తాన్‌ రాష్ట్రాలలోని రాష్ట్ర యంత్రాంగాలకు 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందించింది. ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ లిమిటెడ్‌–ఏవీపీ స్ట్రాటజీ నిహార్‌ చెద్దా మాట్లాడుతూ
‘‘ ఈ నెలలోనే తెలంగాణా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఈ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందించనున్నాం. ఈ యంత్రసామాగ్రి అంతా కూడా సీఈ ధృవీకృతం కావడంతో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు లోబడి ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులకు మద్దతు నందించాల్సిన అత్యవసర పరిస్థితుల వేళ, ఈ యూన్సిట్లు ఆక్సిజన్‌ సిలెండర్లపై ఆధారాపడాల్సిన ఆవశ్యకతను తగ్గిస్తాయి. వాతావరణం నుంచి ఆక్సిజన్‌ను ఈ కాన్సన్‌ట్రేటర్లు సంగ్రహించడం వల్ల రోగికి సౌకర్యవంతంగా చికిత్సనందించడం వీలవుతుంది. ఈ క్లిష్టకాలంలో మద్దతును కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: