సీఎం పర్యటనలో యథేచ్చగా కోవిడ్ ఉల్లంఘనలు
రాష్ట్రానికి మరోసారి కోవిడ్ ముంపు ఉండొచ్చు
నీతులు చెప్పినవారే ఉల్లంఘనలకు పాల్పడితే ఎలా
కాంగ్రెస్ నేత జి.నిరంజన్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
కెసిఆర్ జిల్లా పర్యటనలతో రాష్ట్రములోమరో సారి కరోనా ముప్పు పొంచివుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ఆందోళన వ్యక్తంచేశారు. సిద్దిపేట పర్యటనలో భౌతిక దూరం ఎవరూ పాటించలేదన్నారు. సీఎం ప్రసంగిస్తున్నప్పుడు మాస్క్ ధరించలేదని, ఆయనపై నిబంధనల ప్రకారం వేయి రూపాయల జరిమానా విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా జి.నిరంజన్ మాట్లాడుతూ..మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సలహా ఇచ్చిన వారే ఉల్లంఘిస్తే ఎట్లా, భౌతిక దూరము మాస్క్ నిబంధనలు ప్రజలకేనా? అధికారములో ఉన్న వారికి పట్టవా, కరోనా హెచ్చరికలను విస్మరించి మునిసిపల్ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు నిర్వయించి ఇదివరకే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. 6 లేదా 8 వారాల్లో వైరస్ మూడవ వేవ్ రావచ్చనే నిపుణుల హెచ్చరికల మధ్య ప్రజల ప్రాణాలను పణంలో పెట్టి, లాక్ డౌన్ ఎత్తి వేసి, ఆర్నెళ్ళలో ఎప్పుడో వచ్చే హుజూరాబాద్ ఎన్నికల సమాయాత్తములో భాగంగా ప్రచార మాధ్యమాలనుపయోగించుకుని అభివృద్ది భాకాను ఊదడానికే, కె.సి.ఆర్ నేటి నుండి జిల్లా యాత్రల పేరిట ఆర్భాటానికి శ్రీకారము చుట్టారు. కరోనా వేళ జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలు, ఇతర భవనాలను సాదాసీదాగా వాడుకలోకి తేకుండా సాధారణముగా ప్రగతి భవన్, ఫార్మ్ హౌజ్ దాటని సి.ఎం, ఇంత దుబారా ఖర్చుతో ఆర్భాటం చేయాల్సిన అవసరమున్నదా? ఆత్మ విమర్శ చేసుకోవాలి. సి.ఎం మాట్లాడుతూ, వాక్ శుద్ది, చిత్తశుద్ది, లక్ష్యశుద్ది కావాలన్నారు. నిజమే వారి వాక్ శుద్ది ఏ పాటిదో తానన్న మాట మరిచి తానే ముఖ్యమంత్రి అయినప్పుడే తెలిసి పోయింది. తన చిత్తశుద్ది, లక్ష్యశుద్ధితో ప్రజాస్వామ్యము ఎలా విల విల లాడుతుందో రాచరికము ఎలా విరజిల్లుతుందో ప్రజలు గమనిస్తున్నారు. లాక్ డౌన్ లో కూడా జరిమానాల పేరిట కోట్లాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేసిన ఈ ప్రభుత్వము చిత్తశుద్ది తెలియనిది కాదు. ఊకదంపుడు ఉపన్యాసాలు మాని ప్రజాక్షేమం దృష్ట్యా జిల్లాల బాట మాని కరోనా థర్డ్ వేవ్ ను అడ్డుకునే బాటలో పడితే ప్రజలు సంతోషిస్తారు. అని జి.నిరంజన్ పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: