కరోనా కష్ట కాలంలోపేదలను ఆదుకోండి

సహయానికి కోట్లు ఉండనక్కర్లేదు.....మనస్సుంటే చాలు

 వెల్ఫర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐ ఎం అహమ్మద్



(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

 కరోనా కష్ట కాలంలో గత జున్ 2020 నుండి నేటివరుకు తన సొంతనిధులతో పేదలకు తమవంతు సామాజిక బాధ్యతగా రేషన్ కిట్లు,వస్త్రాలు, కూరగాయలు నిత్యావసర సరుకులు దఫా దఫాలుగా అందజేస్తున్న న్యాయవాది, వెల్ఫర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఐ ఎం అహమ్మద్. కోవిడ్ సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఏడాది పూర్తయిన సందర్భంగా పేదవితంతు మహిళలకు తన వంతు సహాయంగా ఆదివారం తన కార్యాలయంలో  ఆర్థిక సహాయం వస్త్రాలు,మాస్కులు అందజేశారు.

 


ఈ సందర్భంగా ఐ ఎం అహమ్మద్ మాట్లాడుతూ ఇతరులకు తోచిన సహాయం చేయడానికి కొట్లాది రూపాయలు, కోటీశ్వరులే కానవసరం లేదన్నారు.ఉన్న దాంట్లో అనవసర ఖర్చులు, ఆడంబరాలు పోకుండా ఇతరులకు సహాయ పడవచ్చని అన్నారు. దిగువ మధ్య తరగతి,మధ్యతరగతి వారు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, వాచ్ మెన్లు, చిన్న చిన్న ప్రవేట్ టీచర్లు, నిరోద్యుగులు, పత్రికా విలేకరులు, వీడియో గ్రాఫర్లు, జూనియర్ న్యాయవాదులు, కార్పెంటర్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు,ఆటో డ్రైవర్లు, ఇలా ఎన్నో వర్గాల వారు చాలా ఆర్థిక బాధలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వం వడ్డి లేని రుణాలు ఇవ్వడం ద్వారా  ఈ కుటుంబాలను ఆదుకోవాలని ఐ ఎం అహమ్మద్ కోరారు.
















,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: