వాక్సీన్ తీసుకుంటే కరోనా రాదు..
వదంతులు నమ్మవద్దు...
ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాలవ్య
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
వాక్సిన్ తీసుకున్న 15 రోజుల లోపు కరోనా వస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని డాక్టర్.మాలవ్య ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. కరోనా నియంత్రణ కోసం వాక్సీన్లు ఉపయోగపడతాయని సూచించారు.వదంతులు నమ్మకూడదని అన్నారు. ఆత్మ విశ్వాసంతో వాక్సీన్ తీసుకోవడం మంచిది అన్నారు. వాక్సీన్ సంజీవిని లాగా పనిచేస్తుందని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వారు మూడు నెలల వరకు వాక్సీ న్ తీసుకోకూడదని ఇసిఎంఆర్ సూచించినట్లు తెలిపారు. కరోనా తీసుకున్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, జలుబు లాంటివి వచ్చినపుడు కేవలం పారాసెటమాల్ మాత్రలను మాత్రమే వాడాలి. అంతేకాని నొప్పుల మాత్రలు డైక్లో ఫినాక్ సోడియం, ఐఫేన్యాక్ లాంటివి వేసుకోవడం ప్రమాదం.
ఆల్కహాల్ లాంటి మాదక ద్రవ్యాలకు మూడు రోజులు దూరంగా ఉండాలని సూచించారు. మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య నాలుగు నెలల నిడివి ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. బి.పి, షూగర్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే మందులు వాడవచ్చు. మహిళలు పీరియడ్స్ సమయంలోనూ తీసుకోవచ్చు. వాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్కులు, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. పోషక విలువలు కలిగిన అన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. ఎలాంటి ఆహార నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏమైనా అంటే డాక్టర్ సలహాల ప్రకారం వాక్సీన్ తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు సైతం వాక్సీన్ తీసుకోవచ్చు. గర్భిణులు, బాలింతలు డాక్టర్ల సలహా మేరకు తీసుకోవాలి. ఏలాంటి భయాందోళనకు లోనుకాకుడడు. ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కరోనా బారిన పడకుండా రక్షించుకోవాలి.
న్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: