జిల్లాలో వర్గాలు లేవు.. అంతా జగన్ వర్గమే

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ప్రకాశం జిల్లా వైసీపీలో ఎవరికీ వర్గాలు లేవని.. అంతా జగన్ వర్గమే అన్నారు వైసీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.. కొద్దిరోజులుగా జిల్లాలో ఇద్దరు కీలకనేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీ మాత్రమే తమకు ముఖ్యం అని.. తామంతా పార్టీలో సాధారణ కార్యకర్తల్లాగా ఉన్నాము.. మా అంతిమ లక్ష్యం ఏపీలో వైసీపీ పాలనను శాశ్వతం చేయడమే అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల తోపాటు జిల్లా అధ్యక్షుడైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ముందుకు వెళతామని వెల్లడించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, జిల్లాలో బాలినేనే తమకు అధిష్టానం అని చెప్పిన ఏలూరి..

మిగిలిన నాయకుల అభిప్రాయాలను కూడా గౌరవిస్తామని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు బాలినేని అనుమతి లేకుండా గ్రూపుల పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని ఆయన అన్నారు. 11 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కొత్తగా వచ్చిన కొందరు నేతలు ప్రవర్తించడం బాధాకరం.. అటువంటి నేతలు లౌక్యంగా ఉంటేనే భవిశ్యత్ ఉంటుందని ఏలూరి హితబోధ చేశారు. మంత్రి బాలినేని  నాయకత్వంలో అందరం కలిసి జిల్లాను అభివృద్ది చేసుకుందామని కోరారు. ఇక ఇటీవల వెలిగొండ ప్రాజెక్టుకు పునరావాసం ప్యాకేజి మంజూరు కావడంలో బాలినేని ముఖ్య పాత్ర వహించారు.. ఆయనకు పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసులుగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఏలూరి రామచంద్రారెడ్డి చెప్పారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: