విధ్వంస రాజకీయాలకు ఆద్యులు మీరు కాదా బాబు
డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
సీమలో ‘హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు అని వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శించారు. రాయలసీమకు చెందిన ఓ ఫ్యాక్షన్ నేత హత్యకు గురైతే.. సీమ జిల్లాల నాయకులకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేసిన చరిత్రను మర్చిపోయారా.? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం ఉన్న మీరు నేరచరితులకు ఆశ్రయం ఇచ్చి వారి జీవితాలను ఇంకా ఇంకా నాశనం చేసిన విషయం సీమ ప్రజలకు ఎప్పటికి గుర్తు ఉంటుంది..
నువ్వు చేసే ఫ్యాక్షన్ రాజకీయాలను ఎదిరించే నేతలను ఆగదొక్కావు.. తండ్రిని చంపినా.. ఫ్యాక్షన్ ను వదిలివేయాలన్న మహానేత ఆశయాన్ని కొనసాగిస్తున్న సీఎం వై.ఎస్. జగన్ మీద నీ ఆరోపణలు నీచత్వానికి పరాకాష్ట.. నువ్వు ఆకాశం మీద ఉమ్ము వేస్తే అది నీ మీదే పడుతుందని గ్రహించు.. ఇకనైనా నీ ఫ్యాక్షన్ డ్రామాలకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలిసిపో. అని ఆయన చంద్రబాబుకు హితవు పలికారు. ఇంకా ఆయన మాట్లాడుతూ...కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో మాజీ సర్పంచి నాగేశ్వరరెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి హత్యకు గురవ్వడం బాధాకరంఈ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.. కానీ ఎక్కడ హత్య జరిగినా దానిని వైసీపీకి అంటగట్టడం చంద్రబాబుకు అలవాటైపోయింది. చనిపోయిన వారికి మూడు దశాబ్దాలుగా ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం వైసీపీ నేతలే హత్య చేయించారని వ్యాఖ్యలు చేయడం దారుణం.. 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి' అన్న చందంగా.. నీ హయాంలో పడగవిప్పిన ఫ్యాక్షన్ రక్కసి.. వైఎస్ఆర్ పాలనలో అంతమైంది.. కానీ నేడు ఆయన కుమారుడు ఏలుతున్న రాజ్యంలో అలజడి రేకెత్తించేందుకు మళ్ళీ ఫ్యాక్షన్ ను తట్టి లేపుతున్నావు.. ప్రజలకు ఎవరు ఎలాంటి వారో స్పష్టంగా తెలుసు. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సాహిస్తూ నీ పార్టీని నువ్వే భూస్థాపితం చేసుకుంటున్నావు. అని ఆయన హెచ్చరించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: