సీజనల్ వ్యాధులు..కరోనాపై

అవగాహన కార్యక్రమాలు

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కేతగుడికి గ్రామ సచివాలయం వద్ద 104 డాక్టర్ ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు, కరోనాపై తీసుకోవలసిన జాగ్రత్తలను గ్రామ ప్రజలకు వివరించి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 104 డాక్టర్ ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో 104 వాహనంలో మా వైద్య సిబ్బందితో నిరంతరం ఏదో ఒక పంచాయతీలో వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారికి వైద్య చికిత్సలు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
సీజనల్ వ్యాధులు మండలంలో సంభవించే సమయం కావడంతో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. చిన్న పిల్లలు, బాలింతలు మరియు గర్భవతులు ఎక్కువ జాగ్రత్తలు వహించాలని చిన్నపాటి వ్యాధి వచ్చినా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోనే కాకుండా 104 వాహనం తో ఒక డాక్టరు తో పాటు నలుగురు వైద్య సిబ్బందితో నిరంతరం వైద్య చికిత్సలు అందించేందుకు వైద్య విధానంలో నూతన ఒరవడిని తీసుకురావడం జరిగిందని ఇందుకు గానూ మండల ప్రజలందరూ 104  వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ శ్రీకాంత్, డిఈఓ విజయ్ కుమార్, ఎం. ఎల్. హెచ్. పి. సునీత, ఏఎన్ఎం శివలక్ష్మి, మల్లేశ్వరి, ఆశా వర్కర్ తిరుపతమ్మ, 104 వాహన డ్రైవర్  వెంకటేశ్వర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: