ఆ మొత్తం తిరిగి చెల్లించాలి

ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలి

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

లాక్ డౌన్ సమయంలో, నిబందనల ఉల్లంఘనలు చేశారని విధించిన చలానలను, ఫైన్లను రద్దు చేసి వాహనదార్ల నుంచి ఇప్పటికే వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించే విధముగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ఆ లేఖలోని ప్రధానాంశాలు ఇలావున్నాయి. ఉల్లంఘనల పేరుతో వేసిన ఫైన్లను రద్దుచేసి జప్తు చేసిన వాహనాలను కూడా ఎటువంటి ఫైన్ లేకుండా వదిలి వేయాలని విఙప్తి చేశారు. లాక్ డౌన్ సమయంలో బయటకు వచ్చిన వారు ఉద్దేశ్య పూర్వకంగా రాలేదని, ప్రజలు రాష్ట్రములో లాక్ డౌన్ ఉంటుందని ఊయించలేదని, సంసిద్దత లేకుండా వచ్చిన లాక్ డౌన్ తో తప్పనిసరి పరిస్థితుల్లో పొట్టచేత పట్టుకుని బయటకు వచ్చారని గమనించాలని కోరారు. ఒక వైపు ఉపాది లేక ఆదాయం కొల్పోయి, ఇబ్బందులు పడుతున్న తరుణములో చలాన్లను రద్దు చేసి, వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లిస్తే ఎంతో ఊరట కలుగుతుంది. జప్తు చేసిన వాహనాలను కూడా ఎటువంటి రుసుము లేకుండా విడుదల చేస్తే వారి బ్రతుకులు గాడిలో పడటములో సహకరిస్తాయి. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: