కరోనాపై అవగాహన పెంచండి

ప్రజలే స్వీయ నియంత్రణ పాటించేలా చేయండి

ప్యూటీ స్పెషల్ కలెక్టర్ (డి ఎం ఓ ) వసంత బాబు 


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎస్. నరసింహులు ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ పై ఏఎన్ఎంలు, అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ వాలెంటీర్ల  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ వసంత బాబు ముఖ్యఅతిథిగా  పాల్గొని మండల టాస్క్ఫోర్స్ అధికారులతో మండలంలోని కరోనా పై ఏ విధమైన జాగ్రత్తలు పాటిస్తున్నారు. వ్యాక్సినేషన్ మండలంలో ఎంతవరకు పూర్తయిందో ఏఎన్ఎం లను, అంగన్ వాడి కార్యకర్తల ను, వాలంటరీలను అడిగారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ (డి ఎం ఓ ) వసంత బాబు మాట్లాడుతూ కరోనా ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కరోనాపై ప్రజలు అవగాహనతో మెలగాలని ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు స్వీయ నియంత్రణ లో ఉండేలా గ్రామ వాలంటీర్లు అంగన్వాడి కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

మండలంలో 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని  తెలియజేశారు. నాయుడుపల్లి కాలనీ, బీసీ కాలనీ లలో ఇంటింటికి తిరుగుతూ  వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించుకోవాలని సభ్యులకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో పి.శైలేంద్ర కుమార్, ఎం డి ఓ ఎస్ నరసింహులు, మండల వైద్యాధికారి కే వంశీ కృష్ణ, ఈవో ఆర్ డి.అచ్యుతరావు, వి ఆర్ ఓ శేఖర్ రెడ్డి, సర్పంచ్ పల్లె పోగు.వరాలు, ఉప సర్పంచ్ వెన్న. సత్యనారాయణ రెడ్డి , ఏఎన్ఎంలు, అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: