మధ్యహ్నా భోజన పథకంకు మహర్థశ
సర్పంచ్ షేక్ షాజహాన్
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలములోని తుమ్మలచెరువు గ్రామములోని జిల్లాపరిషత్ హైస్కూల్, మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల నందు ఈరోజు మధ్యాహ్న భోజన పధకం క్రింద కందిపప్పును పిల్లలకు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ షేక్ షాజహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్యక్రమములో భాగంగా 1-9-2020 నుండి 31-01-2021 వరకు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నాలుగున్నర కేజిలు, ప్రాధమిక పాఠశాల పిల్లలకు 6వ తరగతి నుండి 10వ తరగతి పిల్లలకు ఆరున్నర కేజిలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియచేశారు.
జగనన్న ప్రభుత్వం అధికారములోకి వచ్చిన తరువాత మధ్యాహ్న భోజనం పధకం స్వరూపాన్ని మార్చి పిల్లలకు అధిక క్యాలరీలు గల పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారని, పాఠశాలలలో నాడు-నేడు కార్యక్రమము క్రింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పాఠశాలలను అభివృద్ధి చేశారని కాబట్టి గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చేర్పించి మంచి విద్యను పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమములో పాఠశాలల ప్రధానోపాధ్యయులు చీదా మల్లికార్జునరావు, ఆర్.పి. నాసరయ్యగారు మిగిలిన సహోపాధ్యాయులు గ్రామ పెద్దలు షేక్ బడా రసూల్, పూజ కాశయ్య, పాఠశాలల అభివృద్ధి ఛైర్మన్లు షేక్ అక్బర్ బాష, షేక్ నన్నే రసూల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: