హ్యాపీ ఫాదర్స్ డే చెప్పి,,,

కానరాని లోకానికి 

రోడ్డు ప్రమాదంలో..జర్నలిస్టు కుమారుడి మృతి

(జానోజాగో వెబ్ న్యూస్-మేడ్చల్ ప్రతినిధి)

తన తండ్రికి ఎంతో ఉత్సాహంగా హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఆ చిన్నారి బాలుడు కొన్ని గంటల వ్యవధిలోనే కానరాని లోకానికి వెళ్లిపోవడం పలువురిని విషాదంలో ముంచెత్తింది. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేస్తున్న టీయూడబ్ల్యూజే నాయకుడు జగన్ కుమారుడు సాయి(13) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గజ్వేల్ నియోజకవర్గంలో గల మండల కేంద్రమైన ములుగు జగన్ స్వగ్రామం. నిన్న మధ్యాన్నం 3 గం.ల ప్రాంతంలో అతని కుమారుడు సాయి(13) సైకిల్ పై వెళ్తుండగా రాజీవ్ రహదారిపై అతివేగంతో వస్తున్న కారు అతనిని ఢీ కొట్టింది.

అపస్మారకస్థితికి చేరుకున్న సాయిని సమీపంలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ స్థానిక పాత్రికేయులతో కలిసి గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని జగన్ ను ఓదార్చారు. మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. ఆదివారం రాత్రి ములుగులో జరిగిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: