అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

 ప్రకాశం జిల్లా ఎస్పీ  సిద్దార్థ్ కౌశల్


(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

జిల్లాలో పోలీస్ శాఖలో అవినీతికి తావులేకుండా పోలీసు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, క్రిందిస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందిస్తూ, వారు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, (ఐపీఎస్) ఆదేశించారు. పోలీస్ శాఖలో అన్ని స్ధాయిలలో జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని, విధినిర్వహణలో అలసత్వం వహించి అవినీతి అక్రమాలకు పాల్పడిన సిబ్బంది, అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.

 పోలీస్ శాఖలో నూతన సంస్కరణలు చేయుచూ జిల్లాలో పోలీసు విధి నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణ, సేవ, పోలీస్ సంక్షేమం మరియు పలు అంశాలలో పోలీస్ శాఖ యొక్క కీర్తి అత్యున్నత పతాకస్థాయికి చేరిందని, దీనిని ఏ ఒక్కరైనా భంగ పరిచే విధంగా అవినీతి చర్యలు చేసినట్లు మా దృష్టికి వచ్చిన యెడల ఉపేక్షించే ప్రసక్తే లేదని, జిల్లాలో పోలీసు శాఖ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని తీవ్రస్థాయిలో ఎస్పీ గారు హెచ్చరించారు. పోలీస్ శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుందని, ఇటువంటి వారిపై సీనియర్ అధికారులు నిరంతర పర్యవేక్షణ వుంచి వారిలో ఆత్మపరిశీలన భావనను రేకెత్తించి పోలీస్ శాఖలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లలో నమోదు చేసిన కేసుల విషయంలో గాని మరియు ఏదేని సివిల్ వివాదాల విషయంలో గాని పోలీస్ స్టేషన్ అధికారి, సిబ్బంది మరియు సంబంధింత వ్యక్తులు ఎవ్వరైనా అవినీతికి పాల్పడినట్లు సమాచారం వస్తే వెంటనే డయల్ 100 నెంబర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని మరియు  పోలీస్ వాట్సాప్ ఫోన్ నెంబర్ 9121102266 కు మెసేజ్ ద్వారాసమాచారంఅందించాలని, అటువంటి సదరు సమాచారం తెలియచేసిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలియచేశారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: