వదిలిపెట్టం... వేటాడుతాం
నారా లోకేష్
పెసరవాయిలో టీడీపీ నేతల కుటుంభాలకు పరామర్శ
ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి హత్యలపై సీఐడీ విచారణ చేయించాలి
(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)
కర్నూలు జిల్లా గడివేముల మండల పెసరవాయిలో హత్యకు గురైన టీడీపీ నేతల కేసు విచారణను సీఐడీకి అప్పగించాలని టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. తద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని కాపాడుకోవాలని ఆయన కోరారు. హత్యకు గురైన గడివేముల మండలం, పెసరవాయి గ్రామం టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిల పార్ధీవ దేహాలకు నారా లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లోకేష్‌ను చూసిన వారు బోరున విలపించారు. ఆయన వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ వెంట కర్నూల్ జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, మాజీ మంత్రి. ఎమ్మెల్సీ ఎన్.ఎం.డీ. ఫారూఖ్ , పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు ఉన్నారు.
అనంతరం నారా లోకేష్ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇప్పటి వరకు 27 మంది టీడీపీ నేతలను అతి దారుణంగా చంపారన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్థన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలపై అన్యాయంగా దొంగ కేసులు పెట్టి.. నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ‘అయ్యా మేము సింహం లాంటి వాళ్లం మిమ్మల్ని వదిలిపెట్టం వేటాడతామని’ హెచ్చరించారు. మంచి పనులు చేయాలంటే అభివృద్ధి చేయాలని లోకేష్ సూచించారు. పరిశ్రమలు తీసుకువచ్చి, నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. చేతకాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎదురుదాడి చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఈ హత్య లపై ప్రభుత్వానికి చిత్తసుద్ది వుంటే వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించాలని ఆయన చెప్పారు. గ్రామంలో అధికారులు అబివృద్ధి చేయవలసింది పోయి, శాంతి భద్రతను కల్పించాల్సి ఉందన్నారు. మృతుని భార్య ఒడు లక్షి దేవమ్మ పిర్యాదు మేరకు పెసరవాయ గామంలోని దారం శ్రీకాంత్ రెడ్డి. గడివేముల ఎల్లారెడ్డి. గడివేముల యశ్వంత్ రెడ్డి, సిగసాని దామోదర రెడ్డి దారం రాజారెడ్డి. బోయ బండపలి రామమదిలేటి. దారం కేదార్ రెడ్డి .దారం శేషాద్రి రెడ్డి. షేక్ సద్దాం. దారం నిరంజన్ రెడ్డిలపై సీఐడీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. .ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు మంచాలకట్ట శ్రీనివాసరెడ్డి, గడివేముల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి. టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: