టీడీపీ నేతల ధారుణ హత్య

హత్యకు గురైన అన్నదమ్ములు

పెసరవాయిలో విషాద ఛాయలు

ఘటన స్థలానికి చేరుకొన్న గౌరు చరితా రెడ్డి

మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ

నింధితులను కఠినంగా శిక్షించాలి

బాధిత కుటుంభానికి పరామర్శించేందుకు రానున్న నారా లోకేష్ 


(జానోజాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా లో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు రాజుకొన్నాయి. పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఈ ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యాయి. పెసరవాయిలో టీడీపీ పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపేశారు. పాతకక్షలే హత్యకు కారణంగా తెలుస్తోంది. మృతులు మాజీ సర్పంచ్ ఒడ్డు నాగేశ్వర రెడ్డి, అతని తమ్ముడు, వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. శ్మశానానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇదిలావుంటే తమ పార్టీ నేతల హత్యపట్ల టీడీపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బాధితకుటుంభాన్ని పరామర్శించేందుకు 

 


తొలుత బొలేరో వాహనాలతో ఢీకొట్టి.. అనంతరం వేటకొడవళ్లతో నరికి చంపేశారు. మూడు రోజుల క్రితం చనిపోయిన సమీప బంధువుకు సమాధి వద్దకు మూడు రోజుల మెతుకులు వేసేందుకు శ్మశానానికి వెళ్తుండగా కాపు కాచి ప్రత్యర్థులు హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకొని  పెసరవాయి గ్రామంలో జరిగిన వడ్డు ప్రతాప్ రెడ్డి, వడ్డు నాగేశ్వర్ రెడ్డిల హత్య జరిగిన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని గౌరు చరితా రెడ్డి డిమాండ్ చేశారు. హత్యకు గురైన టీడీపీ నాయకుల  కుటుంబాలను పెసరవాయి  గ్రామంలో శుక్రవారంనాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించనున్నారు.


 


 

 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: