ఉన్నత స్థానాలను అధిరోహించాలి

ఇంతియాజ్ ను ప్రశంసించిన టీమ్ ట్రస్ట్ సభ్యులు

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

మీరు తీసుకొన్న ప్రతి శాఖకు న్యాయం చేశారు..అందరి మనస్సు చూరగొన్నారు. శాఖ ఏదైనా వాటికి వన్నే తెచ్చారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఐఎఎస్ డి.ఇంతియాజ్ ను టీమ్ ట్రస్ట్ ప్రముఖులు డాక్టర్ రహిమాన్, మునీర్ అహ్మద్, సీనియర్ జర్నలిస్ట్ షఫీ అహ్మద్, సామాజిక సేవా కార్యక్రమాల్లో అన్నీ విధాలా ముందుండే సోదరులు అబ్దుల్ బషీర్ (gp hotel) ఆటా ప్రతినిధి బాబా హుస్సేని ప్రశంసించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా  మూడేళ్లపాటు ఏకధా టిగా సమర్థ సేవలందించిన ఏ.ఎమ్. డి. ఇంతియాజ్ మైనార్టీ శాఖ స్పెషల్ సెక్రటరీగా పదోన్నతిపై బదిలీ అయ్యారు.


 జిల్లా కలెక్టర్ హోదాలో  ఆయన మంగళవారం (8న) రిలీవ్ అయ్యారు. ఈ సదర్భంగా వందలాది మంది అధికార, అనధి కార ప్రముఖులు.. కోవిడ్ నిబంధనలు పటిస్తూనే ఆయనను కలిసి ఆయన సేవలు కొనియాడుతూ.. ఉచిత రీతిన సత్క రించి..  తమ అభిమానా న్ని, గౌరవ మర్యాదలు చాటుకున్నారు.. తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కలెక్టర్ మా వరకు ప్రత్యేక అవకాశం ఇచ్చారు.. అందుకు ధన్యవాదాలు అని ఈ సందర్భంగా జర్నలిస్ట్  షఫీఅహ్మద్, టీమ్ ట్రస్ట్ ప్రముఖులు డాక్టర్ రహిమాన్, మునీర్ అహ్మద్, అబ్దుల్ బషీర్ (gp hotel) ఆటా ప్రతినిధి బాబా హుస్సేని తదితరులు పేర్కొన్నారు. ఇంతియాజ్ సేవలను కొనియాడుతూ పదో న్నతిలోనూ మరింత ఉన్నతంగా రాణిం చాలని..మైనార్టీ శాఖ సెక్రెటరీగా తన హయాం లో ఆ శాఖకు ఆ జన సముదాయనికి మరింత మేలు జరిగేలా కృషి చేయాలని  వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: