జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేయాలి
నర్రీ స్వామీ కురుమ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తొలి వెలుగు జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేయాలని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టీస్ కార్యదర్శి నర్రీ స్వామీ కురుమ డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి రిమాండ్ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూకబ్జాల బాగోతాలను మీడియా ద్వారా వెలుగులోకి తేవడం జర్నలిస్టు హక్కు అన్నారు. జర్నలిస్టు హక్కులను కాలరాసే చర్యలను ఆయన ఖండించారు.
కోట్ల రూపాయల భూములను కబ్జా చేసి దళారులు వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వారిపై కేసులు నమోదు చేయకపోవడం విచారకరం అన్నారు. ఇటీవల పోలీసులు రఘును అరెస్టు చేసి 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడం చట్ట విరుద్ధం అన్నారు.
న్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: