నకిలీ విత్తనాలు విక్రయిస్తే,,,కఠిన చర్యలు

గడివేముల ఎస్.ఐ. ఎం.శ్రీధర్ హెచ్చరిక

(జానోజాగో వెబ్ న్యూస్-గడిమేముల ప్రతినిధి)

నకిలి విత్తనాలను ఎవరు విక్రయించిన కఠిన చర్యలు తీసుకొంటామని గడిమేముల ఎస్.ఐ. ఎం.శ్రీధర్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.  గడివేముల మండలం లోని  ధనలక్ష్మి ఫరిటిలైజర్, ఫెస్టి సైడ్. కిసాన్ అగ్రీమాల్.మన గోమోర్ ఎరువుల దుకాణాలలో గడివేముల ఎస్.ఐ. ఎం.శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆయన దుకాణాలు యజమానుల తో మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు కురవడంతో మద్దతు ధర పలుకుతుందన్న భావనతో  రైతులు ఎక్కువగా  పత్తి విత్తనాలు.

మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసుకుంటునారని తెలిపారు. అలాంటి వారికి నాణ్యమైన విత్తనాలు మాత్రమే  సరఫరా చేయాలని.  నకిలీ విత్తనాలు విక్రయాలు జరపడానికి వీలు లేకుండా చేసుకోవాలిని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రధాన రహదారిపై ఇరువైపుల నిల్వ ఉంచిన వాహనదారులకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో  ఏఎస్ఐ  వెంకటేశ్వరులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: