బక్కచిక్కిన నియంత

కిమ్ ఆరోగ్యంపై పలు వద్దంతులు

వెలుగులోకి వచ్చిన ఫోటోలు


(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

ప్రపంచంలో భయంకరమైన దేశాధినేతగా ప్రాచుర్యం పొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ప్రస్తుతం వద్దంతులు వ్యాపిస్తున్నారు. తాజాగా ఆయన ఫోటోలు బయటకు రావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఆ ఫోటోలో బరువు తగ్గి చిక్కిపోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కావాలనే చిక్కిపోయారా లేక అనారోగ్య సమస్యలా అన్నది చర్చనీయామైంది. ఇటీవల జరిగిన తాజా సమావేశంలో స్లిమ్‌గా కిమ్ కనిపించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను అక్కడి అధికారిక మీడియా విడుదల చేసింది. కిమ్  చైన్ స్మోకర్. ఊపిరితిత్తులు,హృదయ సంబంధిత సమస్యలే ఆయన్ని వెంటాడుతున్నాయని తెలిసింది. 2014లోనూ ఆరు వారాల పాటు ఆయన కనిపించకుండా పోయారు. ఆరోగ్యం చెడిపోయిన ప్రతీసారి ఆయన ఇలా నెలల తరబడి ప్రజలకు కనిపించకుండా పోతారన్న ప్రచారం ఉంది. 


 వైరల్ అవుతున్న ఫోటో

దక్షిణ కొరియాలోని సియోల్ మీడియా హౌస్‌ల ద్వారా ఈ ఫోటోలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్ మునుపటిలా బరువైన శరీరంతో కాకుండా స్లిమ్‌గా కనిపించారు. ఆయన చేతికి అత్యంత ఖరీదైన స్విస్ వాచ్ ఆ ఫోటోల్లో కనిపించింది. గతేడాది డిసెంబర్,2020లో లీకైన ఫోటోల్లోనూ ఈ వాచ్ కనిపించింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆ వాచ్ ఆయన చేతికి అంత టైట్‌గా కనిపించలేదు. ఆయన బరువు తగ్గారని చెప్పేందుకు అంతర్జాతీయ మీడియాలో దీన్నో ఉదాహరణగా చెబుతున్నారు. డోనల్డ్ ట్రంప్: ఓటమి తరువాత తొలిసారిగా ప్రసంగించిన అమెరికా మాజీ అధ్యక్షుడు.. కొత్త పార్టీ ఏర్పాటుపై వివరణ Ads by Ads by గతంలో 140 కేజీల బరువు... కిమ్ జోంగ్ ఉన్ నవంబర్,2021లో 140 కేజీల బరువుతో ఉన్నట్లు తెలుస్తోంది. 2011లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 50 కేజీల బరువు పెరిగారు. అప్పటినుంచి ఆయన్ను అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయన్న ప్రచారం ఉంది. గతేడాది కొద్ది నెలల పాటు ఆయన కనిపించకుండా పోయిన సమయంలో.... తీవ్ర అనారోగ్యమే ఇందుకు కారణమన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఆ ఊహాగానాలు,సందేహాలను పటాపంచలు చేస్తూ గతేడాది జూన్ 6న ఆయన మళ్లీ ప్రత్యక్షమయ్యారు. viral video: అధ్యక్షుడి చెంప ఛెళ్లు -ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌‌కు ఘోర పరాభవం కిమ్ చైన్ స్మోకర్, అనారోగ్య సమస్యలు... కిమ్ జోంగ్ ఉన్ చైన్ స్మోకర్ అని చెబుతారు. ఊపిరితిత్తులు,హృదయ సంబంధిత సమస్యలతో కిమ్ బాధపడుతున్నారన్న ప్రచారం కూడా ఉంది.2014లోనూ ఆరు వారాల పాటు ఆయన కనిపించకుండా పోయారు. ఆరోగ్యం చెడిపోయిన ప్రతీసారి ఆయన ఇలా నెలల తరబడి ప్రజలకు కనిపించకుండా పోతారన్న ప్రచారం ఉంది. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గిన నేపథ్యంలో... ఆయన సర్జరీ ద్వారా బరువు తగ్గారా లేక అనారోగ్య సమస్యల కారణంగా చిక్కిపోయారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పటిలాగే ఈ ప్రశ్నలకు కూడా సమాధానం దొరికే అవకాశం ఎంతమాత్రం లేదు. అయితే కిమ్ తన హెల్త్‌పై ఫోకస్ చేసినందువల్లే బరువు తగ్గి ఉంటాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారైనా ఆయన విషయంలో నిజమైన వార్తలు వెలుగులోకి వస్తాయా అన్నది ఆసక్తిగా మారింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: