ఆ హక్కు ప్రభుత్వానికి లేదు

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ప్రభుత్వ భూములను అమ్మే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ అన్నారు. భవిష్యత్ తరాల అవసరాలకు ప్రభుత్వ భూములను కాపాడిల్సిన భాద్యత ప్రభుత్వానికుందన్నారు. ఈ సందర్బంగా జి.నిరంజన్ మాట్లాడుతూ..ఇప్పుడున్న భూములు అమ్మి, భవిష్యత్ తరాలకు ఏమి మిగిల్చి పొవాలనుకుంటున్నారు, అధికారములో ఉన్న వారు ప్రభుత్వ భూమికి సంరక్షకులే కాని వాటిని అమ్మే హక్కుదారులు కారు. ఏ విధంగానైతే అసైన్డ్ భూమి కలవారికి అనుభవించే హక్కు ఉండి, అమ్మే హక్కు ఉండదో, ప్రభుత్వానికి కూడా నైతికముగా అమ్మే హక్కు ఉండదు. హౌసింగ్ బోర్డ్ ఏర్పడిందే ప్రజల అవసరాలకు ఇళ్ళు కట్టించడానికి, ఆ భాధ్యతను విస్మరించి హౌసింగ్ బోర్డ్ భూములను ఎలా అమ్ముతారు. ఒక వైపు ఇచ్చిన హామీ మేరకు డబల్ బెడ్రూం ఇళ్లకు భూమి లేదంటూ మరొక వైపు ప్రభుత్వ భూములను అమ్మకానికి ఎలా పెడతారు, ఒక వైపు ప్రభుత్వ, దేవాలయాల, అసైన్డ్ భూముల కబ్జా చేశారంటూ మాజీ మంత్రి ఈటెలను బర్తరఫ్ చేసి కేసులు పెట్టి విచారణ జర్పుతూ మరొక వైపు ప్రభుత్వ భూములను అమ్మే నిర్ణయం ఎలా తీసుకుంటారు, ఇది అస్మధీయులను రక్షించుకోవడానికా ? లేక తమ వారికి వేలం పేరుతో అంటగట్టడానికా, తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వ, హౌసింగ్ బోర్డ్ భూముల అమ్మకానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొవడము, సిఎస్ సొమెశ్ కుమార్ వెంటనే రంగముల లోకి దిగి వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం పిలిచి అమ్మకానికి పెట్టబోయే భూముల వివరాలు సేకరించడము రాష్ట్ర భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది. బంగారు తెలంగాణా లో ఈ పరిస్తితి ఎందుకు దాపురించింది, ఆర్థికముగా మిగులు రాష్ట్రమని చెప్పుకున్నామే? ఆ మిగులు ఎక్కడ కనుమరుగైంది, టి.ఆర్.ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ముందు చూపు లేని డుబారా ఖర్చులే ఇందుకు కారణం. కరోనా వలన ప్రభుత్వాదాయము తగ్గటం వాస్తవమే అయినా ప్రభుత్వ భూములను అమ్ముకోవడము తగదు. అది రాష్ట్ర భవిష్యత్తుకు మరియు భవిష్యత్ తరాలకు గొడ్డలి పెట్టు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసహంరించుకుని భవిష్యత్ తరాల వారికి అన్యాయం జరుగకుండా చూడాలి. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: