ఫినో పేమెంట్స్ బ్యాంక్ యొక్క మర్చంట్ నెట్వర్క్
కోవిడ్ -19 వేక్సినేషన్ డ్రైవ్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ఫినో పేమెంట్స్ బ్యాంక్ యొక్క మర్చంట్ అవుట్‌లెట్స్ వేక్సినేషన్ (టీకా) కోసం ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకోవడంలో ప్రజలకు సహాయపడటం ద్వారా కోవిడ్-19 వేక్సినేషన్ డ్రైవ్‌ను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కోవిడ్ -19 నుండి తమకు తాము మరియు ఇతరులను రక్షించుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గాలలో ఒకటి కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు వైద్య నిపుణులు అందరికీ వేక్సినేషన్ వేయాలని సిఫార్సు చేస్తున్నారు.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, Co-WIN పోర్టల్ (www.cowin.gov.in) లేదా ఆరోగ్య సేతు యాప్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఒక వ్యక్తి ముందుగానే COVID-19 వేక్సినేషన్ కోసం రిజిష్టర్ చేసుకోవచ్చు. కొన్ని ఆన్-స్పాట్ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇబ్బంది పడకుండా ఉండటానికి ఆన్లైన్ సిఫార్సు చేయబడింది.
టెక్నాలజీ తెలియనివారికి, స్మార్ట్ ఫోన్లు లేని వారికి సహాయం చేయడం ద్వారా, ఫినో మర్చంట్లు దేశంలోని లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది మరియు వాలంటీర్లతో కలిసి బాధిత కుటుంబాలకు నిస్వార్థ సేవలను అందిస్తున్నారు. ఫినో మర్చంట్లు మీ పరిసరాల్లోనే ఉండి, సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు - హమేషా! సమీప ఫినో మర్చంట్ పాయింట్ ను కనుగొనడానికి, ఎవరైనా https://fino.latlong.in/ పై క్లిక్ చేయవచ్చు లేదా QR కోడ్‌ను scan చేయవచ్చు.
బిస్వజిత్ సింహా, ఫినో పేమెంట్స్ బ్యాంక్ సీనియర్ డివిజనల్ హెడ్ మాట్లాడుతూ, “గ్రామాల్లో ఎక్కువ మంది ప్రజలు, ముఖ్యంగా వృద్దులు మరియు మహిళలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి అవగాహన లేకుండా ఉంటారు, ఇందువల్ల వేక్సినేషన్ వేయించుకోరు లేదా ఆలస్యం చేస్తారు. వారికి సహాయం కావాలి, బాధ్యతాయుతమైన పౌరులుగా మా మర్చంట్లు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు తమ ఆధార్ కార్డుతో ఫినో మర్చంట్లను సంప్రదించి అవసరమైన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మానవత్వాన్ని కనబరచలేని పరిస్ధితులలో, వ్యాక్సినేషన్ డ్రైవ్ యొక్క ప్రభావాన్ని మెరుగుపరిచేందుకు ఇటువంటి చిన్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలి.”
ఫినో మర్చంట్లు తమ స్మార్ట్ ఫోన్ల నుండి Co-WIN పోర్టల్‌ను డైరెక్టుగా లేదా ఫినో మిత్రా లేదా BPay యాప్ ల ద్వారా యాక్సెస్ చేస్తారు. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి, సహాయం కోరిన వ్యక్తి యొక్క మొబైల్ మరియు ఆధార్ నంబర్‌ను మర్చంట్ అందిస్తారు. OTP జనరేట్ అవుతుంది, అది అవసరమైన ఫీల్డ్ లో నింపాలి, దీని ఫలితంగా విజయవంతమైన రిజిస్ట్రేషన్ ను సూచిస్తూ SMS మెసేజ్ వస్తుంది. వేక్సినేషన్ సెంటర్, టైమ్ స్లాట్‌ను ఎంచుకునే అవకాశం ప్రజలకు ఉంది. ఇక వేక్సినేషన్ సెంటర్ కి వెళ్లి మెసేజ్ చూపించి డోస్ వేయించుకోవడమే తరువాయి.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్ డేట్ ప్రకారం, మే 23 నాటికి భారతదేశం అంతటా ఇచ్చిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసులు 21.80 కోట్లు దాటింది. ఈ లిస్టులో సీనియర్ సిటిజన్స్, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ , 45- 60 సంవత్సరాల మరియు 18-44 సంవత్సరాల వయస్సు గలవారికి మొదటి మరియు రెండవ డోసులు ఉన్నాయి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: