కొత్త ఎమ్మెల్సీలు ఆ ముగ్గురేనా...? 

ఈ నెలలోనే మరో 12 స్థానాలు 

వైసీపీలో పెరుగుతున్న ఆశావాహులు

సీమ, గోదావరి జిల్లాలకు ప్రాధాన్యం

ఆచితూచి అడుగులేస్తున్న వై.ఎస్.జగన్(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రత్యేక ప్రతినిధి)

కరోనా సమయంలోనూ రాజకీయ వేడి పుడుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీతో మొదలైన ఈ రాజకీయ వేడి ఇపుడు ఎమ్మెల్సీ పదవుల భర్తీ వార్తల నేపథ్యంలో మరింత వేడెక్కింది. దీంతో ఎమ్మెల్సీ పదవుల కోసం వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. మూడో ఏట అడుగు పెట్టారు. ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన నేతలకు..పార్టీ విజయం కోసం పని చేసిన వారికి ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తరువాత ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇక, నామినేటెడ్ పోస్టుల భర్తీ దిశగా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో శాసన మండలిలో వరుసగా పదవీ విరమణ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో మూడు రాజధానుల బిల్లుల విషయంలో మండలిలో మెజార్టీ ఉన్న కారణంగా టీడీపీ ఆ బిల్లులు అమోదం పొందకుండా అడ్డుకోగలిగింది. దీంతో..అసలు శాసన మండలినే రద్దు చేయాలని..నిర్ణయం తీసుకొని ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసారు. కానీ, ఆ తరువాత వైసీపీకి అసలు విషం బోధపడింది. కొంత కాలం నిరీక్షిస్తే అసెంబ్లీ తరహాలోనే శాసన మండలిలోనూ పూర్తి ఆధిపత్యం వైసీపీకే దక్కనుంది. ముగ్గురు పదవీ విరమణ..వారి స్థానంలో వీరికే.. ఇక, ఇప్పుడు శాసన మండలి చైర్మన్ షరీఫ్..బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు...వసీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కాల పరిమితి ముగియటంతో పదవీ విరమణ చేసారు.
వారి స్థానంలో కొత్త సభ్యుల నియామకం కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టటం.. కేంద్రం ఎన్నికల సంఘానికి కొత్త కమీషనర్ రావటం తో త్వరలోనే ఈ మూడు స్థానాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని తెలుస్తోంది. దీంతో..ఎమ్మెల్యే కోటా లో ఎంపిక కావటంతో ఈ మూడు స్థానాలు వైసీపీ కే దక్కనున్నాయి. ఈ స్థానాల్లో సామాజిక సమీకరణాల్లో భాగంగా మూడు వర్గాలకు ఈ మూడు స్థానాలు కేటాయించాలని సీఎం జగన్ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాయలసీమ నుండి బీసీ వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన రమేష్ యాదవ్ పేరు ఈ మేరకు ప్రచారంలో ఉంది. ఇక, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత..టీడీపీ నుండి వైసీపీలో చేరిన కాపు వర్గానికి చెందిన తోట త్రిమూర్తులుకు ఈ సారి ఎమ్మెల్సీ పదవి ఖాయంగా తెలుస్తోంది. ఇక, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు పేరు ప్రధాన రేసులో ఉంది. మరో లిస్టులో.. అయితే, గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నా. వారికి ఈ నెలలోనే ఖాళీ కానున్న స్థానాల్లో అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ఈ నెల 18న ఏపీ శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏడు టీడీపీకి కాగా..వైసీపీ నుండి ఉమ్మారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. అయితే, జెడ్పీటీసీ .. ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయటంతో ఆ స్థానాల భర్తీ ఇప్పుడు న్యాయ పరమైన అంశంగా మారనుంది. ఎన్నికలకు ఓకే చెప్పి..కౌంటింగ్ కు అనుమతి ఇవ్వటం లేదా... కొత్తగా ఎన్నికలు జరిగిన తరువాత మాత్రమే ఈ స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఈనెల 14న బీజేపీలోకి ఈటల రాజేందర్ -ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో చేరుతారన్న బండి -అమిత్ షా దర్శనం దొరికేనా? 12 స్థానాలు..మండలిలో వైసీపీ ఆధిపత్యం.. వీటితో పాటుగా నామినేటెడ్ కోటాలో టీడీపీ నుండి ముగ్గురు..వైసీపీ నుండి ఒకరు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నాలుగు స్థానాలతో పాటుగా ఇప్పటికే ఖాళీ అయిన మూడు స్థానాల భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం అనుమతి రాగానే వీటి పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో నాలుగు నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కుతాయనేది మాత్రం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలు సైతం భర్తీ ప్రక్రియ పూర్తవుతే పెద్దల సభలో టీడీపీ సంఖ్య బలం మొత్తం 58 స్థానాలకు గాను..15 మందికే పరిమితం కానుంది. దీంతో..శాసన మండలిలో సైతం వైసీపీకి పూర్తి ఆధిపత్యం దక్కనుంది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: