తెలంగాణ మైనారిటీ సికింద్రాబాద్ బాలుర-1 గురుకుల పాఠశాలలో...
లక్కీ డిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
తెలంగాణ మైనారిటీ సికింద్రాబాద్ బాలుర-1 గురుకుల పాఠశాలలో 7వ తేదీన 5వ తరగతి , 8వ తేదీన 6 ,7 ,8 తరగతులకు లక్కీ డిప్ ద్వారా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. 5 తరగతిలో మొత్తం 80 సీట్లకు గాను 60 మైనార్టీలకు, 20 సీట్లు ఎస్సీ, బిసి, ఎస్టి, ఓసీలకు కేటాయించడం జరిగిందని అన్నారు .60 మైనార్టీ సీట్లకు 125 దరఖాస్తులు రాగా అందులో 55 సీట్లు ముస్లిం విద్యార్థులకు కేటాయించి 28 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచడం జరిగిందని అదేవిధంగా క్రిస్టియన్ విభాగంలో 6 దరఖాస్తులు రాగా 5 సీట్లు క్రిస్టియన్ విద్యార్థులకు కల్పించి 1 వెయిటింగ్ లిస్టులో, బీసీ విభాగంలో 66 దరఖాస్తులురాగా
10 మందిని ఎంపిక చేసుకొని 5 వెయిటింగ్ లిస్టులో అలాగే ఎస్సీ విభాగంలో 9 దరఖాస్తులు రాగా 5 ఎంపిక చేసుకుని 4 వెయిటింగ్ లిస్టులలో, ఎస్టి విభాగములో 9 దరఖాస్తులు రాగా 3 ఎంపిక చేసుకుని 2 వెయిటింగ్ లిస్టులో , ఓ సి విభాగంలో 4 దరఖాస్తులు రాగా 2 ఎంపిక చేసుకొని 2 వెయిటింగ్ లిస్టులో ఉంచడం జరిగిందని ఈ దరఖాస్తులన్నింటిని లక్కీ డిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకొని సీట్లు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే గత సంవత్సరం కాలములో మిగిలిపోయిన టువంటి 6, 7 ,8 తరగతుల సీట్లను లక్కీ డిప్ ద్వారా వారివారి సీట్లను వారి కేటగిరిలోనే కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.రమేష్ , హైదరాబాద్ జిల్లా ఆర్ఎల్సి సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు శ్రీదేవి, పద్మశ్రీ, లింగారెడ్డి, కృష్ణారెడ్డి వార్డెన్ ఇమామ్, డి ఈ ఓ శిరీష పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: