కరోనా టెస్ట్ కోసం నిరీక్షణ

గాలిలో కలుస్తున్న ప్రాణాలు

పట్టించుకొనే నాధుడేరీ...?

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న తంతు. కరోనా టెస్టులు చేయకుండా ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బారులు తీరి గంటల కొద్దీ నిలబడిన కొంత మందికే కరోనా టెస్ట్ చేసి పంపిస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే, జిల్లా వైద్యాధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లకోసం ప్రజల చుట్టూ తిరిగిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని వాపోయారు. నలుగురి ప్రాణాలు కూడా పోయినా వైద్యాధికారులు చలించడం లేదని ఆరోపిస్తున్నారు. డబ్బుల సంపాదన ముఖ్యమా ప్రజల ఆరోగ్యాలు ముఖ్యమో తెలుసుకోవాలని అన్నారు. 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: