సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వాలి
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. కొత్త సర్పంచ్ లు ఎన్నికై రెండు నెలలు అవుతున్నా ఇంకా చెక్ పవర్ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, విద్యుత్ దీపాలు, రహదారులు కాల్వల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధుల అవసరం ఉందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని వెంటనే సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెక్ పవర్ మంజూరు చేసినప్పుడే మౌలిక సదుపాయాల కల్పన పనులను చేపట్టేందుకు వీలవుతుందన్నారు. చెక్ పవర్ ఇంత వరకు రాకపోవడంతో సర్పంచ్ లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకొని వెంటనే చెక్ పవర్ ను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: