తడవదు...చిరగదు
త్వరలో మరో కొత్త వంద నోటు
ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఆర్భీఐ
(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ ప్రతినిది)
పెద్దనోట్ల రద్దుతో మనం పాత నోట్లను మర్చిపోయి కొత్త కొత్త నోట్లను చూడాల్సివస్తోంది. దీంతో ప్రస్తుతం దేశంలో రెండు వేలు, ఐదువందులు, వంద, యాభై ఇరవై, పది రూపాయల నోట్లను ఇప్పటికే చూశాం. అయితే రెండు వెల నోట్లు గత కొద్ది కాలంగా మార్కెట్ లో ఎక్కడా కనిపించడంలేదు. క్రమంగా దాని వినియోగం తగ్గుతోందని తెలుస్తోంది. ఇప్పటికే వందనోటును తీసుకొచ్చిన రిజర్వుబ్యాంక్ ఆప్ ఇండియా మరోసారి వంద కొత్త నోటు తీసుకురానున్నది. ఇప్పటికే తెచ్చిన రూ.100 నోట్లు. చూడటానికి ప్రస్తుతం వంద నోట్లు ఎలా ఉన్నాయో కొత్తవి కూడా అలానే ఉంటాయి. అయితే కొత్త నోట్లు ఎక్కువ కాలం మన్నికలో ఉండటమే దాని ప్రత్యేకత.
రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా అతిత్వరలోనే కొత్త రూ.100 కరెన్సీ నోట్లను తీసుకురాబోతోంది. ఇవి చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నోట్లు సాధారణ నోట్ల మాదిరి ఉండవు. చూడటానికి ఒకేలా ఉన్నా కూడా ఇవి స్పెషల్ అని చెప్పాలి. ఆర్బీఐ తీసుకురాబోతున్న కొత్త రూ.100 నోట్లకు వార్నిష్ పూత పూస్తారు. దీని వల్ల ఇవి ఎక్కువ కాలం మన్నికకు వస్తాయి. నీటికి తడవవు. అంత ఈజీగా చినిగిపోవు. దీంతో ఈ కొత్త రూ.100 నోట్లు ఎక్కువ కాలం మన్నికకు వస్తాయి. ఆర్బీఐ ఈ నోట్లను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఆర్బీఐ త్వరలోనే ఈ కొత్త రూ.100 నోట్లను అందుబాటులోకి తీసుకురావొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐకి ఈ నోట్ల ముద్రనకు సంబంధించి అనుమతి ఇచ్చింది. ఇకపోతే కొత్తగా రాబోతున్న నోట్లు.. ప్రస్తుతం రూ.100 నోట్లు ఎలా ఉన్నాయో చూడటానికి అలానే ఉంటాయి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: