పార్టీకి పునర్ వైభవం తీసుకొద్దాం
వరుస ఓటములపై దిద్దుబాట అవసరం
పార్టీ నేతలు, కార్యకర్తల్లో విశ్వాసం పెంచుదాం
తాజా పరిణాహాలపై పార్టీ హైకమాండ్ కు లేఖ
కాంగ్రెస్ విధేయుల ఫోరం సమావేశంలో వక్తులు
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరముందని కాంగ్రెస్ పార్టీ విధేయుల వర్గం అభిప్రాయపడింది. ఇందుకోసం పార్టీ ఓటముల నుంచి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సిన అవసరముందని పేర్కొంది. మంగళవారంనాడు తెలంగాణా కాంగ్రెస్ విదేయుల (లాయలిస్టుల) ఫోరమ్ నాయకులు ఈ రోజు జూమ్ యాప్ ద్వారా సమావేశమై రాష్ట్రములో ప్రస్తుతము నెలకొన్న రాజకీయ పరిణామాలను, నాగర్జునసాగర్, మినీ మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో నెలకొన్న నైరాశ్య వాతావరణాన్ని సమీక్షించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన, లోక్ సభ, జెపిటిసి, ఎం.పి.టి.సి, మునిసిపల్, ఎన్నికలు, కో ఆపరేటి వ్ ఎన్నికలు, శాసన సభ ఉప ఎన్నికలు , జి.హె.చ్ఎమ్.సి ఎన్నికలు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలలో వరుసగా పార్టీ అపజయము పాలవుతున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టనందున పార్టీ స్థితి రోజు రోజుకు దిగజారుతూ, నాగార్జునసాగర్, మినీ మున్సిపల్ పోల్ లో కూడా ఓటమి పాలవడముతో పార్టీ అధిస్టానికి అన్ని విషయాలను వివరిస్తూ మరొకసారి ఒక లేఖ వ్రాయాలని అభిప్రాయపడ్డారు.
మరింత నష్టము జరుగకుండా వేగవంతముగా తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని భావించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ కోరిక మేరకు పోటీ చేసి, వయస్సును, కోవీద్ పరిస్థితులు లెక్కచేయకుండా, అవిశ్రాంతముగా ప్రచారము చేసిన జానారెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసి, విశృంఖలంగా డబ్బులు వెదజల్లినా 70,932 ఓట్లు సాదించడము అభినందనీయం, జిహెచ్ఎమ్ సి పరిధి లోని లింగోజిగూడా వార్డు ఉప ఎన్నికలో గతములో బి.జె.పి గెలిచిన సీటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థీ రాజశేఖర రెడ్డి గెలువడము సానుకూల పరిణామమని అభినందించారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ కార్యకర్తలు గమనించాలని త్వరలోనే పునర్వైభవము దిశలో పార్టీ వెళ్లుతుందని విశ్వసించి ముందుకెళ్లాలని, కరోనా వేళ జాగ్రత్తగా ఉండాలని , ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు విఙప్తి చేశారు. జాతీయ విపత్తుల సంస్థ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి , మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్, అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎమ్.కోదండ రెడ్డి, మాజీ ఎమ్.ఎల్.సి. బి.కమలాకరరావు, మాజీ ఖాదీ బోర్డ్ చైర్మన్ జి.నిరంజన్, పి.సి.సి మేధావుల విభాగము చైర్మన్ ఎ.శ్యామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: