హైకోర్టు లాయర్ల హత్య కేసు,,,
విచారణకు ప్రత్యేక కోర్టు
పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన వామనరావు దంపతుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇందుకోసం కరీంనగర్ సెషన్స్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారు. ప్రత్యేక కోర్టు ద్వారా అయితేనే విచారణ వేగంగా పూర్తవుతుందని ప్రభుత్వం కోరింది. లాయర్ల హత్య కేసుపై సీబీఐ విచారణ చేయించాలని వామనరావు తండ్రి కోరగా హైకోర్టు నిరాకరించింది. తామే స్వయంగా విచారణను పర్యవేక్షిస్తామని చీఫ్ జస్టిస్ ధర్మాసనం పేర్కొంది. అయితే, ఇప్పుడు కేసు విచారణను కరీంనగర్ సెషన్స్ కోర్టుకు బదిలీ చేసేందుకు చీఫ్ జస్టిస్ ఒప్పుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
న్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: