కోవిడ్ క్వారంటైన్ సెంటర్ ను,,

తనిఖీ చేసిన ఎమ్మెల్యే శిల్పా రవి 


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనిలో ఉన్న కోవిడ్ క్వారంటైన్ సెంటెర్ ను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులకు పెట్టె భోజనాన్ని స్వయంగా తిని పరిశీలించారు. అనంతరం అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని తీరుస్తానని హామీ ఇచ్చి, ఏ సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అలాగే ప్రతిరోజు అక్కడ ఉండే కరోనతో బాధ పడుతున్న ప్రజలకు సమయానికి ఆహారం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

 


అందరు మమల్ని  దూరంగా ఉంచుతుంటే  మీరు మాత్రం ధైర్యంగా మా వద్దకు వచ్చి మా సమస్యలు తెలుసుకొని మాకు పెట్టె అన్నం తిని మా ఆరోగ్యం పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధకు ధన్యవాదాలు సార్ అని ఒక కరోనా బాధితుడు అన్నారు. మీరు కూడా ధైర్యంగా ఉండండి ఎం భయపడాల్సిన అవసరం లేదు అని వారికీ ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే శిల్పా రవి. ఈయన వెంట మునిసిపల్ కమిషనర్ వెంకట కృష్ణ, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: