ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోండి

గవర్నర్ కు లేఖ రాసిన బండి సంజయ్

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ ప్రాంతంలో కరోనా ప్రభావం తీవ్రత దృష్ట్యా ఉచిత వైద్యం కోసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. పేదలకు ఉచిత వైద్యం అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణాలో అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల కు ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించాలని, వెంటనే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు ఉచిత వైద్యం అదేలా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భీమా డబ్బును 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని పేర్కొన్నారు. ఆక్సీజన్,  బెడ్స్ సౌకర్యం కొరవతో ప్రజలు కరోనా చికిత్సను పొందక ప్రాణాలు కోల్పోతున్నారనీ వివరించారు. ప్రభుత్వం నిర్లక్షం వీడి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: