కార్మిక హక్కులను హరించే విధానాలకు,,,

వ్యతిరేకంగా" మే డే "

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తర్లుపాడు మండలంలో శనివారం సి ఐ టి యు ఆధ్వర్యంలో ఘనంగా వివిధ యూనియన్స్  ఆధ్వర్యంలో జరిగింది. తర్లుపాడు బస్టాండ్ నందు సి ఐ టి యు జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా  రైతు సంఘం జిల్లా నాయకులు వై.పాపిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక వర్గం శతాబ్దాల తరబడి పోరాడి  సాధించుకున్న కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మరియు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజావ్యతిరేక విధానాలైన 4 లేబర్ కోడ్ లను, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలనిడిమాండ్ చేశారు. కరోనా కాలంలో కార్మికులు ఉపాధి కోల్పోతే మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకు కరోనా  ప్యాకేజీలు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్  వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు.
కోవిడ్ వారియర్స్ కి అదనపు వేతనం ఇవ్వాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని, కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు తీసుకుని నిర్ణయాల వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడే కార్మికులకు, ప్రజలకు నిత్యవసర వస్తువులు ఉచితంగా అందించాలని ఆర్థిక సహాయం చేయాలని, పెరుగుతున్న కోవిడ్  కేసులను అనుగుణంగా బెడ్స్,ఆక్సిజన్, వైద్యం, ఐసోలేషన్ సెంటర్స్ అవసరమైన మేరకు ఏర్పాటు చేయాలని ఉన్నారు. కోవిడ్ నిర్ధారణ టెస్ట్ రిపోర్ట్స్ వెంటనే వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. కరోనా తో  ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి  7,500/- రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కే సుబ్బరాయుడు, ఎం పుల్లమ్మ, ఎం బాలమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: