తుగ్లక్ పాలనను మరిపిస్తుంది

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రాష్ట్రంలోని కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను మరిపిస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మే 7న లాక్ డౌన్ వేస్ట్, ప్రజలు ఇబ్బంది పడతారు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని చెప్పిన కె.సి.ఆర్, ఈ రోజు ఉన్నఫలముగా రేపు ఉదయం 10గంటల నుండి లాక్ డౌన్ అని చెప్పడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. లాక్ డౌన్ వేస్ట్ అని కె.సి.అర్ చెప్పడంతో ప్రజలు కూడా మన రాష్ట్రములో లాక్ డౌన్ ఉండదనే ధీమాతో ముందస్తు సంసిద్దత లేకుండా ఉన్నారు. ప్రజల కష్టనష్టాలను ఎదుర్కొనే మార్గాలను చర్చించకుండా, అరగంటలో లాక్ డౌన్ నిర్నయాన్ని ఎలా ప్రకటిస్తుంది, ప్రజలకు, లాక్ డౌన్ అమలు చేసే పోలీసులు, అధికారులకు ఊపిరి పీల్చే అవకాశము కూడా ఇవ్వరా, ముస్లిం సోదరుల రంజాన్ పండుగ రెండు రోజులలో ఉన్నది. వారికి పండుగ తయారీ లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అచేతనా అవస్థలో, ఉన్నది హైకోర్ట్ ఆదేశిస్తే కాని స్పందించని పరిస్థితి ఉంది. రాష్ట్ర సరిహద్దుల్లో, ఇతర రాష్ట్రాల అంబులెన్సులు ఆపే మానవత్వం లేని ప్రభుత్వముగా, కె.సి.ఆర్ ప్రభుత్వం అభాసు పాలైనది. తానొక్కడే రాష్ట్ర ప్రజలను గట్టెక్కించ గలననే అహం నుండి బయటపడి, కె.సి.ఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరి సూచనలతో, సహకారముతో , సమన్వయముతో ప్రజలను ఆదుకునే దిశలో వ్యవహరించాలి.అని ఆయన పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: