నాయనపల్లి క్యారెన్టైన్ కేంద్రాన్ని  సందర్శించిన అఖిలపక్షం

క్వారయింటైన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

 కరోనా తీవ్రరూపం దాల్చి మరణాలు  ఎక్కువ అవుతున్న  పరిస్థితులు పట్ల  యంత్రాంగం అప్రమత్తం కావలిసిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా రోగులకు సరిపడ వైద్యులు వైద్య సిబ్బంది లేకపోవడం మందులు కొరత  ఏర్పడడం వంటివి పట్ల దృష్టి పెట్టడం మరి ప్రధానంగా గత 4 రోజుల నుండీ కరోనా నిర్ధారణ  కేంద్రాల్లో నిర్దారణ పరీక్షలు నిర్వహించడం లేదని రోజుకి 200 పైగా కేసులు వస్తున్నప్పుడు 4 రోజులు పరీక్షలు చేయకపోతే  వ్యాదిగ్రస్తులు నుండి బాగా వ్యాప్తి చెందుతుందని ఇది సమస్యలకు కరణమౌతుందని  ప్రభుత్వం  వీటన్నిటిని పరిష్కరించి కరోనా ని కట్టడి  చెయ్యండని  అఖిలపక్షం నాయకులు  ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. లేపాక్షి మండలం నాయనిపల్లి క్వారంటైన్ కేంద్రంలోని రెండురోజల క్రితం ఇద్దరు చనిపోయారు అలాగే అక్కడి రోగులు పరిస్థితులు పై వీడియోలు పంపగా పలువురు సమస్యలు  అఖిలపక్షం దృష్టికి  తీసుకుపోగా శనివారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్సీపీ శ్రీనివాసుల అధ్యక్షత న నాయినపల్లి క్వారయింటైన్ సెంటర్ ను సందర్శించారు.
అక్కడ బాధితులు తో మాట్లాడారు సమస్యలను ఆడిగితెలుసుకున్నారు  అనంతరం  వైద్యాధికారి శ్రీదేవి  తో మాట్లాడారు ఇటీవల పత్రికలలో కథనాలు బాధితులు నుండి ఫిర్యాదులు    వంటివి జరుగుతున్నాయని క్వారంటైన్ లో వైద్యులు వైద్య సిబ్బంది కొరత ఉందని మందులు అందడం లేదనే అంశాలను ప్రస్తావించారు  వైద్యుల సిబ్బంది కి పై అధికారులు కి తెలపడం జరిగిందని  అయితే మందులు కొరత  లేదని మందులు  మౌలిక సదుపాయాలు బాగున్నాయి ఆమె  తెలియజేసారు. ఇక్కడ ఉన్న సమస్యలను ప్రభుత్వం దృషికి తీసుకెళ్తామని   ఇక్కడి బాధితులు కు భరోసా  కల్పించాలని  ప్రతి ఒక్కరికి చైతన్యం కల్గించాలని ఇబ్బందులు  తలెత్తకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు  అఖిలపక్షం నాయకులువైద్యాధికారికి  సిబ్బందికి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ మానోహర్ ఆర్సీపీ శ్రీనివాసులు బీఎస్పీ శ్రీరాములు డి.ఇ. రమేష్ కుమార్  ఉమ్మర్ ఫారూఖ్ మాజీ కౌన్సిలర్ మహబూబ్ బాషా సీఐటీయూ వెంకటేష్ అమానుల్లా దుర్గా నవీన్ సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: